Saturday, January 31, 2026
HomeHealthబెల్లం ఎక్కువ తింటే శరీరానికి ప్రమాదమా? డాక్టర్లు చెబుతున్న నిజాలు

బెల్లం ఎక్కువ తింటే శరీరానికి ప్రమాదమా? డాక్టర్లు చెబుతున్న నిజాలు

Published on

చాలా మందికి ఒక ఆలోచ‌న ఏం ఉంటుంది అంటే, పంచదార తింటే శ‌రీరంలో షుగ‌ర్ స్ధాయి పెరుగుతుంది, ఇది శ‌రీరానికి అంత మంచిది కాదు. కాని బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిది అని భావిస్తారు.

అయితే బెల్లం కూడా అతిగా తీసుకుంటే డేంజ‌ర్ అంటున్నారు న్యూట్రిషియ‌న్లు డాక్ట‌ర్లు. గ‌తంలో బెల్లం త‌యారీ ప్రాసెస్ వేరు కానీ ఇప్పుడు బెల్లం తయారీ వేరు. పంచ‌దార‌తో త‌యారు అయ్యే బెల్లం కూడా మార్కెట్లో వ‌స్తోంది దీంతో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

అయితే బెల్లం పిండివంట‌లు మ‌నం ఇష్టంగా తింటాం. బెల్లం పాయ‌సం బెల్లం పొంగ‌లి, బెల్లంతో ప‌ర‌మాన్నం ఇలా అనేక ర‌కాల వంట‌కాలు చేస్తాం. కానీ బెల్లం అతిగా తిన్నా చాలా చేటు అనే విష‌యం తెలుసుకోండి.

షుగ‌ర్ 100 ప‌ర్సెంట్ మ‌న శ‌రీరానికి హాని చేస్తే, బెల్లం 90 శాతం హాని చేస్తుంది. అంటే కేవ‌లం 10 శాతం మాత్ర‌మే దాని మీద త‌క్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది.

Also Read  MicroPhobia:చీమకు భయపడి యువతి ఆత్మహత్య!

బెల్లంలో ఇనుము, కాల్షియం, భాస్వరం ఇలా ప‌లు పోషకాలు ఉంటాయి. అయితే మోతాదుకి మించి తీసుకుంటే చాల డేంజ‌ర్ .

బ‌రువు త‌గ్గాలి అనుకుంటే బెల్లం తీసుకోవ‌ద్దు అంటున్నారు డాక్ట‌ర్లు.
కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి మితంగానే తీసుకోవాలి.
ఆర్గానిక్ అంటూ వ‌స్తున్న బెల్లం కూడా కేవ‌లం వారానికి లేదా ప‌ది రోజుల‌కి మాత్ర‌మే షుగ‌ర్ పేషెంట్స్ తీసుకోవాలి అని తెలియ‌చేస్తున్నారు.
5 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు రోజూ బెల్లం అవాయిడ్ చేయ‌డం మంచిది. వారానికి లేదా ప‌ది రోజుల‌కి నువ్వులు ప‌ళ్లీల‌తో చ‌క్కీలు మాత్ర‌మే ఇవ్వండి.
ఇక గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు మందులు వాడుతున్న వారు బెల్లం తీసుకోకూడ‌దు.
బెల్లం గర్భిణీ స్త్రీలకు కూడా హానికరం ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది గర్భధారణ సమయంలో హాని కలిగిస్తుంది. క‌డుపుతో ఉన్న వారు బెల్లం అవాయిడ్ చేయాలి.
ఇక కుట్లు ప‌డినా ఆప‌రేష‌న్ అయినా రెండు నెల‌లు బెల్లం తిన‌వ‌ద్దు అంటున్నారు వైద్యులు.
ఇక జీర్ణ‌సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఆప‌రేష‌న్ చేయించుకున్న వారు, ఎక్కువ‌గా బెల్లం తింటే ఆ జీర్ణ‌వ్య‌వ‌స్ధ‌మీద ప్ర‌భావం చూపించి ప్రాణాల‌కు ముప్పు తెస్తుంది అంటున్నారు.

  • ఆర్గానిక్ బెల్లం కూడా దాని త‌యారీ బ‌ట్టి మితంగా వాడ‌వ‌చ్చు అంటున్నారు వైద్యులు*
Also Read  వర్షాకాలంలో డెంగ్యూ భయం – చిన్న చిన్న జాగ్రత్తలతో ఎలా కాపాడుకోవాలి?

Latest articles

MicroPhobia:చీమకు భయపడి యువతి ఆత్మహత్య!

సంగారెడ్డి జిల్లా అమీనాపూర్‌లో మనీషా అనే యువతి నిన్న ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఆత్మహత్య వెనుక ఉన్న కారణం...

వర్షాకాలంలో డెంగ్యూ భయం – చిన్న చిన్న జాగ్రత్తలతో ఎలా కాపాడుకోవాలి?

మూడు కాలాల్లో ముఖ్యంగా వ‌ర్షాకాలం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వైర‌ల్ ఫీవ‌ర్స్ , అనారోగ్యాలు కూడా తిష్ట‌వేసేది ఈ...

ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఇలా చేసి వెంటనే గుర్తించండి, లేదంటే అంతే సంగతులు.

ఎండాకాలం అంటే తప్పకుండా తినాల్సిన ప్రూట్ పుచ్చకాయ. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ పండును పిల్లల్ని నుంచి...

ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయని తింటున్నారా..? అది ఎంత ప్రమాదమో తెలుసుకోండి.

సమ్మర్‌లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ వీటిని తినడం వల్ల...

రాత్రి పడుకునే ముందు పాలల్లో ఇది ఒక్క స్పూన్‌ వేసుకొని తాగితే చాలు, మీకు సూపర్ పవర్స్ వస్తాయ్.

తినాలని అనిపించినా సరే.. నోరును కట్టేసుకుంటారు. కానీ, నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...