టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు పలు సినిమాల్లో నటిస్తున్నారు.. చెప్పాలంటే సౌత్ లో చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో నటించాలి అని కోరుకుంటున్నారు.. మన తెలుగు సినిమాలు చాలా వరకూ పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి, ఇక్కడ నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు..మన హీరోల మార్కెట్ కూడా అంతే పెరిగింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, తారక్, ఎన్టీఆర్, ప్రభాస్ రామ్ చరణ్ ఇలా స్టార్లు అందరూ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తున్నారు. వీరితో నటించేందుకు పాన్ ఇండియా రేంజ్ లో ముద్దుగుమ్మలు ఒకే చెబుతున్నారు.
మన తెలుగు సినిమా స్దాయి ఒక రేంజ్ కి చేరింది..అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కమలినీ ముఖర్జీ. తొలి సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.లవ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె బాగా సూట్ అవుతుందనే పేరు పొందింది.
ఇక తర్వాత ఆమెకి తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి.. గోదావరి, గమ్యం ఈ సినిమాలు ఆమె నటనకు స్కోప్ ఇచ్చిన సినిమాలు, అవార్డ్ విన్నింగ్ చిత్రాలుగా నిలిచాయి.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో ఆమె శ్రీకాంత్ మరదలుగా నటించింది.. ఈ సినిమా తర్వాత ఆమె టాలీవుడ్ లో పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించపోవడం ఆమె అభిమానులకి నిరాశ కలిగించింది. అయితే ఆమె ఎందుకు తెలుగు సినిమాల్లో నటించడం లేదు అనేదానిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఒక తెలుగు సినిమాలో తాను పోషించిన పాత్రను తెరపై చిత్రీకరించిన విధానం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని తెలియచేసింది కమలినీ.. అందుకే ఆ బాధతో నేను తెలుగు సినిమాలు నటించడం లేదరి
తెలిపింది. ఆ తర్వాత చాలా అవకాశలు వచ్చినా ఆమె నో చెప్పిందట.. ఆ ఒక్క సంఘటన తో తాను టాలీవుడ్ కి దూరం అయ్యాను అనే విషయం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో నటించిన సమయంలో హీరోలు అందరూ చాలా సపోర్ట్ గా ఉండేవారు అని తెలిపింది.
హీరోల్లో నాగార్జున చాలా మంచివారని ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అదే హ్యాండ్సమ్ గా ఉన్నారు అని తెలిపింది.. శర్వానంద్ నటన కూడా చాలా బాగుంటుంది, ఆయన సహజంగా నటిస్తారు, సుమంత్ కూడా చాలా మంచివారని తెలిపింది.. గోవిందుడు అందరివాడేలే ఆమెకి తెలుగులో చివరి సినిమా.. తెలుగులో సినిమాలు చేయకపోయినా ఆమె తమిళ మలయాళంలో సినిమాలు చేసింది
తమిళ్ లో ఇరైవి మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి పులిమురుగన్ చిత్రాల్లో నటించింది ఇవి ఆమెకి అక్కడ చిత్ర పరిశ్రమల్లో ఎనలేని గుర్తింపు తెచ్చాయి.
ఆమె నటించిన సినిమాలు చూస్తే
ఆనంద్
మీనాక్షి
గోదావరి
స్టైల్
రాఘవ
క్లాస్ మేట్స్
హ్యాపీ డేస్
పెళ్ళైంది కానీ
జల్సా
గమ్యం
గోపి గోపిక గోదావరి
మా అన్నయ్య బంగారం
నాగవల్లి ఈ సినిమాల్లో ఆమె నటించారు