మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి పాజిటీవ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో మంచు కుటుంబం నటించింది .మంచు మోహన్ బాబు, విష్ణు వారి పిల్లలు కూడా ఇందులో నటించారు.
ఇక ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్ప అనే ఈ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించారు. ప్రభాస్ పాత్ర కూడా ఎంతో ప్లస్ అయింది సినిమాకి, ఇక ఇందులో చాలా మంది నటీనటులని భాగం చేశారు.
మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల , శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ బ్రహ్మానందం, రఘు బాబు కీలక రోల్స్ చేశారు.
థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ డీల్ గురించి కూడా ఎక్కడా వార్తలు బయటకు రాలేదు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ భాషల్లో విడుదలైంది కన్నప్ప. సినిమా ఓటీటీ డీల్ ?అలాగే ఎప్పుడు వస్తుంది ? ఎందులో వస్తుంది అనేదానికి సంబంధించి ఓ వార్త అయితే వినిపిస్తోంది.
జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది కన్నప్ప. ఇక ఇప్పటికే థియేటర్ రన్ పూర్తిగా క్లోజ్ అయింది.
మరి ఓటీటీ డేట్ ఎప్పుడు అనేది అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. ఏదైనా సినిమా పెద్దది అయినా చిన్నది అయినా విడుదలైన 7 నుంచి 8వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ఇక పది వారాలు దాటినా ఎలాంటి అప్ డేట్ లేదు కన్నప్ప గురించి. తాజాగా సమాచారం ప్రకారం కన్నప్ప రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాని సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకూ.