మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప .. జూన్ నెలలో 27 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. పెద్ద ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో మోహన్ బాబు ఈ సినిమాని నిర్మించారు. భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు. అయితే ఈ సినిమా ధియేటర్ రన్ పూర్తి అయి చాలా కాలం అయింది. అయితే ఇంకా ఓటీటీ డేట్ లాక్ అవ్వకపోవడం చాలా మంది ఓటీటీ అభిమానులు వెయిట్ చేశారు. అయితే ఓటిటి సంస్ధతో చర్చల వల్ల ఈ సినిమా విడుదలకు ఇంత ఆలస్యం అయింది అని టాలీవుడ్ టాక్ వినిపించింది.
తాజాగా కన్నప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. అయితే దియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న ఈ భక్తిరస చిత్రం. ఇప్పుడు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీలో కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు మిలియన్ల వాచ్ అవర్స్ గంట గంటకు పెరుగుతున్నాయి.
కన్నప్ప సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోస్ట్రీమింగ్ అవుతోంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చింది ఇందులో ప్రభాస్ నటన గురించి కూడా అందరూ మాట్లాడుకున్నారు. చాలా బాగా నటించారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందింది. కన్నప్ప సినిమా కోసం విష్ణు ఏకంగా 7 నుంచి 10 సంవత్సరాలు వర్క్ చేశారు. ముకేశ్ కుమార్‌సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలాంటి ఇతిహాసలు తీయడంలో ఆయన చాలా ఎక్స్ పీరియన్స్ ఉన్న దర్శకుడు.
ఇక ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్లో జీవించేశారు. కిరాతగా మోహన్‌లాల్, శివుడిగా అక్షయ్‌కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ వారి నటనతో ఆకట్టుకున్నారు.మోహన్‌బాబు నిర్మాతగా చేస్తూనే మహదేవశాస్త్రిగా అలరించారు.
సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మిడ్ నైట్ 12 గంటల నుంచి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఈ సినిమా గంటల సేపు దాటినా రాలేదు. ఫ్యాన్స్ సినిమా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూదీనిని ట్యాగ్ చేశారు.
ఉదయం పది గంటల నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. ఇక వసూళ్ల పరంగా చూస్తే ఈ సినిమా దియేటర్ రన్ దాదాపు 70 కోట్ల వరకూ వచ్చింది అని టాక్. ఇక ఓటీటీ శాటిలైట్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి మరో 50 కోట్ల వరకూ వచ్చిందని టాక్. ఇలా 120 కోట్ల బడ్జెట్ రికవరీ అయింది కన్నప్ప సినిమాకి .
స్టోరీ వైజ్ చూస్తే
కోయవాడైన తిన్నడు మంచు విష్ణు చిన్నప్పటి నుంచి తనకు ఎదురైన అనుభవాలతో నాస్తికుడిగా మారతాడు. తన గూడెం ప్రజల కోసం ముందు ఉంటాడు.అడవిలో ఉన్న శక్తివంతమైన వాయు లింగాన్ని కాపాడుతూ ఉంటాడు మహదేవశాస్త్రి మోహన్ బాబు. ఈ లింగాన్ని దొంగిలించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాలముఖుడు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య పోరాటంలో విష్ణు తిన్నడు ఎలా వచ్చాడు
మహదేవశాస్త్రి మోహన్ బాబుకి ఎలా సాయం చేస్తాడు, వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్దంలో తిన్నడు ఎలా ఎంట్రీ ఇస్తాడు. నాస్తికుడి నుంచి భక్తుడిగా ఎలా మారాడు.అతని భార్య నెమలి కోరిక నెరవేరింది. ఈ సమయంలో రుద్ర ప్రభాస్ అతనికి ఎలా సాయం చేస్తాడు ఇవన్నీ సినిమాలో చూడాల్సిన అంశాలు.