Saturday, March 21, 2026
HomeNewsKalvakuntla kavitha: జనం బాటలో కవిత — తెలంగాణ కోసం కొత్త పోరాటం..!

Kalvakuntla kavitha: జనం బాటలో కవిత — తెలంగాణ కోసం కొత్త పోరాటం..!

Published on

జనం బాట” అనే కార్యక్రమంతో ప్రజల మధ్యకు మరోసారి అడుగుపెడుతున్న కవిత గారు, ఈ సారి తమ గళాన్ని తెలంగాణలోని ప్రతి ఇంటికి చేరవేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు.

వేదికపై నిలబడి మాట్లాడుతున్న కవిత గారి స్వరంలో తెలంగాణ గర్వం, తెలంగాణ బాధ కలగలిపి వినిపించింది—

“తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు.
1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీలో చెప్పాం.
కానీ వారికి తగిన గౌరవం, వారి కుటుంబాలకు తగిన సాయం ఇవ్వలేకపోయాం,”
అని ఆమె గళం కదిలింది.

“ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని నేను పోరాడుతా.
ప్రభుత్వం ఇవ్వకపోతే, వచ్చే ప్రభుత్వం ఇచ్చేలా చేస్తా.
ఇది నా హామీ కాదు, ఇది నా ప్రమాణం!”

“తెలంగాణలో అందరూ బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాలు —
ప్రతి వర్గానికి సమాన అవకాశాలు రావాలి.
అందరూ బాగుంటేనే తెలంగాణ బతుకమ్మ లాగా అందంగా ఉంటుంది.”

Also Read  సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేస్తాం..

“33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు —
ప్రతి చోట జనం బాటలో నేను వస్తా.
మీరు కూడా రండి. మనం కలిసి తెలంగాణ ఆత్మను కాపాడుకుందాం.”

ఆమె మాటల్లో ఉత్సాహం, బాధ, గర్వం అంతా కలిసిన తెలంగాణ గళం వినిపించింది.

“ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు.
తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మను తీసేయడం మన గుండెల్లో గాయమే.
మళ్లీ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లోకి రావాలంటే పోరాటం తప్పద!”

వేదిక కింద నిల్చున్న ప్రజలు నినాదాలు చేస్తూ స్పందించారు —
జై తెలంగాణ! జై జాగృతి!

ఆ రోజు గన్ పార్క్‌లో కవిత గారి ప్రసంగం ఒక రాజకీయ ప్రకటన కాదు —
అది తెలంగాణ గౌరవం కోసం, అమరవీరుల ఆత్మ కోసం ఇచ్చిన ప్రతిజ్ఞ.
ఆ ప్రతిజ్ఞతోనే కవిత గారి “జనం బాట యాత్ర” అధికారపరమైన పోరాటంగా మారబోతోంద.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...