కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే, యష్ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయి, పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి అంతటి సక్సస్ అందుకుంది .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ
చరిత్రలో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఎంతో మంది కొత్త నటులు కూడా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా కేజీఎఫ్ ద్వారా మంచి ఫేమ్ పొందిన నటుడికి అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతోంది. తన పరిస్దితిని తెలియచేస్తూ కేజీఎఫ్ నటుడు ఒక వీడియో విడుదల చేశారు . అసలు ఆ నటుడికి ఏమైంది అనేది తెలుసుకుందాం.
ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన చిత్రం కేజిఎఫ్ .. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రెండు పార్టులుగా వచ్చింది. ఇక ఆ నటులు ఇప్పటికీ బిజీ స్టార్లు గా మారారు. అందులో మంచి పాపులారిటీ అందుకున్న నటుడు హరీష్ రాయ్. ఆయనకు ఇటీవల క్యాన్సర్ తీవ్రతమైంది చాలా ఇబ్బందిపెడుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. అసలు అప్పటికి ఇప్పటికి మనం ఆయన్ని గుర్తుపట్టలేనంతగా మారిపోయారు హరీష్ రాయ్. బాగా సన్నగా నీరసంగా అయిపోయారు.
కేజిఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్నారు కన్నడ నటుడు హరీష్ రాయ్. ఆయనకు అనారోగ్య సమస్య ఉండటంతో సాయం చేయాలి అని కోరుతున్నారు. హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇది చాలా అతి కొద్ది మందిలో కనిపిస్తుంది అని తెలియచేశారు వైద్యులు. అంతేకాదు ఈ ట్రీట్మెంట్ కి సుమారు 70 లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియచేశారు.
ఆయనకు ఒక్కో ఇంజెక్షన్ 3.5 లక్షల విలువైనది చేయాలని ఇలా ఐదు నెలల్లో 20 ఇంజెక్షన్ల వరకూ చేయాలని వైద్యులు తెలియచేశారు. ఈ ఇంజెక్షన్ లకు దాదాపు 70 లక్షలు అవుతుందని దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయాలి అని హరీష్ రాయ్ కోరారు. అయితే కన్నడ నాట కొంత మంది ఆయనకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అయినా ఆ డబ్బులు సరిపోవడం లేదు. కన్నడ స్టార్లు ప్రముఖ దర్శకులు ఆయనకు తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చినా ఈ సమస్య నుంచి ఆయన బయటపడవచ్చు అని చెబుతున్నారు. దయచేసి దాతలు ఎవరైనా తనకు సాయం చేయాలి అని ఓ వీడియోలో తెలిపారు హరీష్.
ఆ వీడియోలో ఆయన్ని చూసి చాలా మంది బాధఫడుతున్నారు. పొట్ట అంతా ఆయనకు ఇన్పెక్షన్ వచ్చి ఉబ్బిపోయింది .. హరీష్ రాయ్ చికిత్సకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధృవ సర్జ హామీ ఇచ్చినట్లు తాజాగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఓ పది లక్షల రూపాయలు ఆయనకు చెక్కు పంపించారు అని తెలుస్తోంది. మరింత మంది ఆయనకు సాయం చేస్తే ఈ సమస్య నుంచి ఆయన బయటపడతారు అని అక్కడ సినిమా అభిమానులు కోరుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా దేవుడిని ప్రార్ధిద్దాం.