Saturday, May 2, 2026
HomeNewsసాయం కోరుతున్న కేజీఎఫ్ నటుడు - పాపం ఏమైందంటే

సాయం కోరుతున్న కేజీఎఫ్ నటుడు – పాపం ఏమైందంటే

Published on

కేజీఎఫ్ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే, య‌ష్ జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయి, పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి అంత‌టి స‌క్స‌స్ అందుకుంది .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ
చ‌రిత్ర‌లో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఎంతో మంది కొత్త న‌టులు కూడా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. తాజాగా కేజీఎఫ్ ద్వారా మంచి ఫేమ్ పొందిన న‌టుడికి అనారోగ్య స‌మ‌స్య ఇబ్బంది పెడుతోంది. త‌న ప‌రిస్దితిని తెలియ‌చేస్తూ కేజీఎఫ్ న‌టుడు ఒక వీడియో విడుద‌ల చేశారు . అస‌లు ఆ న‌టుడికి ఏమైంది అనేది తెలుసుకుందాం.

ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ హీరోగా వచ్చిన చిత్రం కేజిఎఫ్ .. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో రెండు పార్టులుగా వ‌చ్చింది. ఇక ఆ న‌టులు ఇప్ప‌టికీ బిజీ స్టార్లు గా మారారు. అందులో మంచి పాపులారిటీ అందుకున్న న‌టుడు హరీష్ రాయ్. ఆయ‌న‌కు ఇటీవ‌ల క్యాన్సర్ తీవ్ర‌త‌మైంది చాలా ఇబ్బందిపెడుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌తో ఆయ‌న ఇబ్బంది ప‌డుతున్నారు. అస‌లు అప్ప‌టికి ఇప్ప‌టికి మ‌నం ఆయ‌న్ని గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయారు హ‌రీష్ రాయ్. బాగా స‌న్న‌గా నీర‌సంగా అయిపోయారు.

Also Read  Ajey: The Untold Story of a Yogi (UP CM)

కేజిఎఫ్ సినిమాలో చాచా పాత్రతో భారీ పాపులారిటీ అందుకున్నారు కన్నడ నటుడు హరీష్ రాయ్. ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య ఉండ‌టంతో సాయం చేయాలి అని కోరుతున్నారు. హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇది చాలా అతి కొద్ది మందిలో క‌నిపిస్తుంది అని తెలియ‌చేశారు వైద్యులు. అంతేకాదు ఈ ట్రీట్మెంట్ కి సుమారు 70 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు అవుతుందని డాక్ట‌ర్లు తెలియ‌చేశారు.

ఆయ‌న‌కు ఒక్కో ఇంజెక్ష‌న్ 3.5 ల‌క్ష‌ల విలువైన‌ది చేయాల‌ని ఇలా ఐదు నెల‌ల్లో 20 ఇంజెక్షన్ల వ‌ర‌కూ చేయాలని వైద్యులు తెలియ‌చేశారు. ఈ ఇంజెక్ష‌న్ ల‌కు దాదాపు 70 ల‌క్ష‌లు అవుతుంద‌ని దాత‌లు ఎవరైనా ఉంటే సాయం చేయాలి అని హ‌రీష్ రాయ్ కోరారు. అయితే క‌న్న‌డ నాట కొంత మంది ఆయ‌న‌కు సాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. అయినా ఆ డ‌బ్బులు స‌రిపోవ‌డం లేదు. క‌న్న‌డ స్టార్లు ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆయ‌న‌కు త‌లా ఒక ల‌క్ష రూపాయ‌లు ఇచ్చినా ఈ స‌మ‌స్య నుంచి ఆయన బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అని చెబుతున్నారు. ద‌య‌చేసి దాత‌లు ఎవ‌రైనా త‌న‌కు సాయం చేయాలి అని ఓ వీడియోలో తెలిపారు హ‌రీష్.

Also Read  Hyderabad Amazon గోదాములో BIS రెడ్స్

ఆ వీడియోలో ఆయ‌న్ని చూసి చాలా మంది బాధ‌ఫ‌డుతున్నారు. పొట్ట అంతా ఆయ‌న‌కు ఇన్పెక్ష‌న్ వ‌చ్చి ఉబ్బిపోయింది .. హరీష్ రాయ్ చికిత్సకు ఆసుపత్రి ఖర్చులు భరిస్తానని కన్నడ హీరో ధృవ సర్జ హామీ ఇచ్చినట్లు తాజాగా కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్ప‌టికే ఓ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఆయ‌న‌కు చెక్కు పంపించారు అని తెలుస్తోంది. మ‌రింత మంది ఆయ‌న‌కు సాయం చేస్తే ఈ స‌మ‌స్య‌ నుంచి ఆయ‌న బ‌య‌ట‌ప‌డ‌తారు అని అక్క‌డ సినిమా అభిమానులు కోరుతున్నారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని మ‌నం కూడా దేవుడిని ప్రార్ధిద్దాం.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...