మన దేశ ప్రజలు ప్రభుత్వ బ్యాంకుల పోస్టాఫీసు్లో ఏదైనా స్కీమ్ కట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తారు ఎందుకంటే సెక్యూరిటీ భద్రత కచ్చితంగా ఉంటుంది అని ఆ డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకం ఉంటుంది. అందుకే పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే అనేక స్కీమ్లు పోస్టాఫీసులు బ్యాంకులు అమలు చేస్తూ ఉంటాయి.
ఈ పథకంలో పెట్టే పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే షేర్ మార్కెట్ లా హెచ్చు తగ్గులు డబ్బు దూరం అవ్వడం అనేది ఉండదు. ఇలాంటి స్కీమ్ లో పెట్టుబడి డబ్బులు పొదుపు చేయడం మంచి రాబడిని కోరుకునే వారికి బెస్ట్ ఛాయిస్. ఈ రోజు ఇలాంటి ఓ మంచి స్కీమ్ గురించి తెలుసుకుందాం.
మీ డబ్బులకి భద్రతతో పాటు సురక్షితంగా ఉండాలి అంటే మీరు పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్రస్కీమ్ లో చేరండి. ఈ స్కీమ్ చాలా మేలు ఉపయోగకరమైనదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మంచి రాబడి కూడా ఉంటుంది. డబ్బు స్దిరంగా పెరుగుతూ ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కీమ్ మీ డబ్బుని కూడా రెట్టింపు చేస్తుంది. నిర్ణిత కాలపరిమితిలో కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే, దాదాపు 115 నెలల్లో ఈ మొత్తం రూ. 20 లక్షలు అవుతుంది. మరి ఈ స్కీమ్ లో ఎలా చేరాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ కిసాన్ వికాస్ పత్ర పథకం గురించి మెయిన్ చెప్పుకోవాల్సింది మనకు వడ్డీపై వడ్డీ చక్ర వడ్డీ వస్తుంది. మీరు ప్రతీ సంవత్సరం పొందే వడ్డికి మీ ప్రిన్సిపల్ అమౌంట్ కి చేరి దానిపై వడ్డి కూడా లెక్కిస్తారు.
ఉదాహరణకు చూస్తే మీరు 10 లక్షలు పెట్టుబడి పెడితే తొలి ఏడాది 7.5 శాతం వడ్డీ వస్తుంది. అంటే 75000 దీనిని అసలు పది లక్షలకు కలుపుతారు. దీని వల్ల 10 లక్షల 75000 అవుతుంది. దీనికి వడ్డి కూడా యాడ్ అవుతుంది. ఇలా ప్రతీ ఏడాది వడ్డీ పై వడ్డి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.. 9 సంవత్సరాల 7 నెలల్లో మీ డబ్బు రూ. 20,00,000కు రెట్టింపు అవుతుంది.
- అర్హతలు*
భారతదేశంలో ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు భారతీయుడై ఉండాలి
ఉద్యోగి వ్యాపారి ఎవరైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు
10 సంవత్సరాలు దాటిన ఎవరు అయినా ఇందులో చేరవచ్చు
కిసాన్ వికాస్ పత్ర యోజనలో కేవలం రూ.1000తో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయవచ్చు
ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది డబ్బులకి ఎలాంటి ప్రమాదం ఉండదు
ఈ పథకంపై వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు ప్రయోజనం లేదు అనేది మరవకండి