Wednesday, May 6, 2026
HomeNewsCinemaకోట శ్రీనివాస‌రావు ఇంట మ‌రో విషాదం...నెల రోజుల్లో రెండు విషాదాలు.

కోట శ్రీనివాస‌రావు ఇంట మ‌రో విషాదం…నెల రోజుల్లో రెండు విషాదాలు.

Published on

ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేని ప‌రిస్దితి. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు ఇంట మరో విషాదం నెలకొంది. గ‌త నెల‌లో ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. తాజాగా ఆయ‌న స‌తీమ‌ణి రుక్మిణీగారు క‌న్నుమూశారు. భ‌ర్త దూరం అవ్వ‌డంతో కొన్ని రోజులుగా ఆమె కూడా తీవ్ర వేద‌న‌లో ఉన్నారు. చివ‌ర‌కు ఆమె ఈ రోజు మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

నెల రోజుల్లో రెండు విషాదాలు జ‌ర‌గ‌డంతో సినిమా ప‌రిశ్ర‌మ, ప్ర‌జ‌లు, అభిమానులు ఎంతో బాధ‌లో ఉన్నారు.
కోటా శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల్లోనే ఆయన భార్య రుక్మిణి కన్నుమూశారు. కోట‌గారు జూలై 13 వ తేదీన తుది శ్వాస విడిచారు. ఆయ‌న భార్య నెల రోజుల త‌ర్వాత ఆ వేద‌న‌తో అనారోగ్యంతో క‌న్నుమూశారు అని తెలుస్తోంది.

ఇద్ద‌రు పార్వ‌తి ప‌ర‌మేశ్వ‌రుడిలా ఉండేవారు, వారి వివాహ బంధం సుమారు 57 ఏళ్లుగా కొన‌సాగింది. భార్య‌ని ఎంతో ప్రేమ‌గా చూసుకునేవారు. రుక్మిణిగారి వయస్సు 75 సంవత్సరాలు. 1968లో ఆయనకు రుక్మిణిగారితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆయన కొడుకు పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు మరణించారు.

Also Read  AP:వెనుక కూర్చున్న వారికి హెల్మెట్ తప్పనిసరి!

కోటగారి కుటుంబంలో ఈ విషాద వార్త విని చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు, అభిమానులు కుటుంబ స‌భ్యులు కూడా క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు.

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...