కల్యాణీ ప్రియదర్శన్ అక్కినేని హీరోతో తెలుగులో సినిమా చేసి మరింత పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ
అఖిల్ అక్కినేనితో హలో సినిమాలో నటించింది. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరి సినిమాలో నటించింది. తాజాగా ఆమె మలయాళంలో నటించిన ఫిమేల్ సూపర్ హీరో సినిమా కొత్త లోక ఛాప్టర్ 1 చంద్ర ..ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లీన్ నటించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్ అతిథి పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.
ఈ చిత్రానికి డొమినిక్ దర్శకత్వం వహించారు. ఇక తెలుగులో ఈ సినిమాని సితార నాగవంశీ విడుదల చేశారు. మరి ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ
చంద్ర కల్యాణీ ప్రియదర్శన్ కు సూపర్ పవర్స్ ఉంటాయి. అయితే ఈ విషయం కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఈ సూపర్ పవర్స్ గురించి ఎవరికి తెలియకుండా అందరి ముందు సాధారణ అమ్మాయిలా ఉంటుంది. ఇక తను ఓ రెస్టారెంట్ లో పనిచేస్తుంది. ఈ సమయంలో అపార్ట్ మెంట్లో అద్దెకు ఉంటుంది. అక్కడ ఎదురుగా ఉండే నస్లీన్ సన్నీఅనే అబ్బాయి ఆమె మీద ప్రేమ చూపిస్తాడు, కొన్ని రోజులకి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఈ సమయంలో ఆమె శక్తుల గురించి సన్నీ తెలుసుకున్నాడా, బెంగళూరులో ఆమె అసలు ఏం చేస్తుంది, ఆమెకి ఈ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి..చంద్రను నాచియప్ప గౌడ శాండీ ఎందుకు టార్గెట్ చేశాడు. అసలు చంద్ర గతం ఏమిటి, ఇవన్నీ తెలియాలి అంటే కచ్చితంగా వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఇలాంటి సూపర్ పవర్ , సూపర్ హీరో సినిమాలు అంటే మనం మొత్తం హాలీవుడ్ నుంచి చూస్తాం. ఆ సినిమా ఫ్లేవర్ అలాంటిది అక్కడ నుంచి మనకు తెలుగులో కూడా ఇక్కడ సక్సస్ అవుతాయి. అయితే ఇక్కడ దర్శకుడు ఈ కథని తెరపై చూపించిన ప్రతీ ప్రేమ్ బాగుంది. చెప్పాలంటే ఈ స్టోరీకి గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నారు, అంతేకాదు చెప్పదలచుకున్న కథని స్కీన్ ప్లే చాలా అద్బుతంగా ఉంది.. కథలో జానపదాన్ని చక్కగా మిళితం చేశారు.
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, ముఖ్యంగా ఎడిటింగ్ విజువల్స్ యాక్షన్ సీన్లు చాలా బాగున్నాయి. కల్యాణీ ప్రియదర్శన్ చాలా బాగా నటించింది. ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా కథనం ఆకట్టుకుంది. అయితే సెకండాఫ్ లో కాస్త డల్ మూమెంట్స్ ఉన్నా అది కొన్ని నిమిషాలు మాత్రమే. అణిచివేతకు ఎదురు నిలిబడి పోరాడిన యోధురాలిగా చంద్ర పాత్ర అద్బుతంగా చూపించారు. ఇంటర్వెల్ తర్వాత కధ లో వేగం మరింత పెరిగింది.
రెగ్యులర్ సూపర్ హీరో కథలతో కంపేర్ చేసి చూసినా, ఈ సినిమాకి 75 శాతం మార్కులు ఇవ్వవచ్చు. కొన్ని చోట్ల కామెడీ కూడా పండింది.
కల్యాణి ప్రియదర్శిని ఇప్పటివరకు కమర్షియల్ పాత్రలు చూశాం. వండర్ ఉమెన్ గా సూపర్ పవర్స్ ఉన్న రోల్ లో చాలా చక్కగా సెట్ అయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫైట్స్ అద్బుతంగా కంపోజ్ చేశారు.
కూలీఫేమ్ సౌబిన్ షాహిర్, హీరోలు టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో చక్కగా నటించారు
మైనస్ గా చెప్పుకోవాల్సింది సూపర్ విమెన్‌కు ధీటైన సూపర్ విలన్ ఎవరూ లేరు ఇందులో, ఇక సినిమాలో సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకులకు ఈ వారం మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది ఈ మూవీ.