వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కన్నబాబు తండ్రి సత్యనారాయణ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
కురసాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటంతో హైదరాబాద్ లోని ప్రైవైట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ అందించారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో కాకినాడలోని నివాసంలో ప్రాణాలు కోల్పోయారు.
కురసాల కన్నబాబు రాజకీయంగా ఎంత పేరు పొందారో తెలిసిందే, ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా సేవలందించారు. ఆయన మరణంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు స్ధానిక నాయకులు పట్టణ ప్రజలు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కన్నబాబు జర్నలిజం వృత్తిగా ఆయన కెరియర్ మొదలు పెట్టారు. 18ఏళ్లు ఆయన జర్నలిస్ట్ గా సేవలంచించారు, తర్వాత మెగాస్టార్ పై అభిమానంతో ప్రజారాజ్యంలో చేరారు.
2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్నారు.
2014 ఎన్నికల సమయంలో కన్నబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయంగా చాలా ఆలోచన చేశారు, చివరకు ఆయన జగన్ వద్దకు చేరి వైసీపీ తీర్దం పుచ్చుకున్నారు.
2016లో వైఎస్సార్‌సీపీలో చేరి 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
జగన్ కు నమ్మదగిన వ్యక్తిగా జిల్లాలో పేరు సంపాదించారు.
జగన్ ఆయనకు వ్యవసాయశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు .2024 ఎన్నికల్లో మళ్లీ కాకినాడ రూరల్ నుంచి వైెసీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు.
కన్నబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవిలో ఉన్నారు. విజయసాయిరెడ్డి పార్టీ వీడటంతో ఆ పదవి కన్నబాబుకి అప్పగించారు జగన్..
కన్నబాబు తండ్రి మరణించారు అనే వార్త తెలిసి పార్టీ నేతలు స్ధానికులు సంతాపం తెలియచేస్తున్నారు.