90స్ మిడిల్‌క్లాస్ బయోపిక్ తో యువతకు చేరువైన మౌళి తనూజ్ తాజాగా సిల్వర్ స్క్రీన్ పై పరిచయం అయ్యాడు.
ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొట్ట మొదటి థియేట్రికల్ సినిమా లిటిల్ హార్ట్స్.. ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. ఇక ప్రమోషన్స్ లో మౌళి మాట్లాడిన మాటల వీడియో కూడా పెను వైరల్ అయ్యాయి. ఈ వారం మూడు సినిమాల నడుమ గట్టి పోటీతో ఈ యంగ్ హీరో బరిలోకి దిగాడు. మరి .లిటిల్ హార్ట్స్ సినిమా ఏ విధంగా ఆకట్టుకుంది అనేది ఓసారి చూద్దాం.
నటీనటులు మౌళి తనూజ్ ప్రశాంత్, శివాని నాగారం, రాజీవ్ కనకాల, అనిత చౌదరి
దర్శకుడు సాయి మార్తాండ్
సంగీత దర్శకుడు : శింజిత్ యర్రమిల్లి
కథ*
అఖిల్ మౌళి చదువుల్లో యావరేజ్ స్టూడెంట్ పెద్దగా మార్కులురావు, తండ్రి గోపాలరావు రాజీవ్ కనకాల అతన్ని బాగా చదివించి ఇంజనీర్ చేయాలి అని కలలు కంటాడు. కానీ ఎంసెట్ లో సీటు రాదు, చివరకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తాడు తండ్రి. సేమ్ అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి వస్తుంది కాత్యాయని శివానీ నాగారం. ఆమె కూడా యావరేజ్ స్టూడెంట్. తల్లితండ్రులు ఇద్దరు డాక్టర్లు ఇక కూతురిని డాక్టర్ ని చేయాలి అని వారి కల. చివరకు ఇద్దరు ఇక్కడ పరిచయం అవుతారు. ఫ్రెండ్స్ నుంచి ప్రేమగా వీరి పరిచయం మారుతుంది. ఆ తర్వాత కాత్యాయని తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి అఖిల్ కి తెలియచేస్తుంది. అదే వీరి ప్రేమకి అడ్డంకి అవుతుంది. ఇంతకీ ఆమె ఏం చెప్పింది, ఆ తర్వాత వీరిద్దరు జీవితంలో సక్సస్ అయ్యారా, వీరి ప్రేమకధ చివరకు ఏమైంది అనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.
విశ్లేషణ
90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ప్రతీ ఒక్కరి హృదయాల్ని స్పృశించే వెబ్ సిరీస్. అందులో మౌళి నటన కూడా సూపర్బ్. అలాంటి మౌళి సినిమా సెలక్షన్ లో కూడా తొలి నిర్ణయం చాలా బాగుంది. మౌళి ఈ సినిమా కథని బాగా ఎంచుకున్నాడు. తనకు పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యే స్టోరీ. అభిమానులకి సినిమా ప్రియులని మౌళి ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు..సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా బాగుంది. వందకి వంద మార్కులు పడతాయి. ఇక కామెడీ టైమింగ్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో మౌళి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఓ సాంగ్ చాలా నవ్వు తెప్పిస్తుంది. తన హావభావాలు యాక్టింగ్ చాలా బాగుంటాయి. ఇక తనకు జోడిగా నటించిన అందాల భామ హీరోయిన్ శివాని నాగారం ఈ సినిమాకి మరో కీలకం అయింది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు తర్వాత ఓ సూపర్ మూవీ ఆమెకి పడింది అనే చెప్పాలి.
మరో యువ నటుడు జై కృష్ణ వీరిద్దరి తర్వాత అతనికి మార్కులు పడతాయి. అద్బుతమైన యాక్టింగ్ కామెడికి ఈ సినిమాలో కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. ఇక ఫస్టాప్ చాలా నవ్వులు పూయించారు జై కృష్ణ. ఇక తండ్రిగా నటించిన రాజీవ్ కనకాల పాత్ర ఎప్పటిలాగానే అలరించారు. ముఖ్యంగా కొడుకు కోసం తన విద్య కోసం తపనపడే ఫాదర్ గా జీవించేశారు..ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ వారి పాత్రల పరిధిమేరకు నటించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని చోట్ల ఎమోషనల్ ట్రాక్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. పెద్దగా బోర్ లేకుండా ఓల్డెన్ డేస్ కి సినిమా చూసేవారిని తీసుకువెళుతుంది ఈ చిత్రం..అఖిల్ పాత్రతో మంచి మార్కులు కొట్టేశాడు మౌళి..సింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన మ్యూజిక్ మరో అసెట్ అయింది. సందర్భానుసారం బీజీఎం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా – లిటిల్ హార్ట్స్ నవ్వించే ఫ్రెష్ కామెడీ, ఎంటర్‌టైన్ చేసే యూత్ ఫుల్ సినిమా
బోర్ కొట్టని ఓ మంచి స్టోరీ.