టాటు స్పెషలిస్ట్ గా హైదరాబాద్ లో అందరికి సుపరిచితమయ్యారు లోబో.. అయితే బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నారు, బిగ్ బాస్ ఐదో సీజన్ లో కామెడి ఎంటర్ టైనింగ్ ఎంతో జనరేట్ చేశాడు లోబో.
మెగాస్టార్ సినిమాలో కూడా నటించాడు, ఓ పక్క సినిమా అవకాశాలు మరో పక్క టీవీ షోలతో ఫుల్ బిజీ అయ్యాడు లోబో.. అయితే తాజాగా లోబోకి ఓ కేసు విషయంలో ఏడాది జైలు శిక్ష పడింది. ఈ వార్త ఆయన అభిమానులకి ఒక్కసారిగా షాకిచ్చింది అనే చెప్పాలి.
బిగ్ బాస్ ఐదో సీజన్ షోలో అలరించిన లోబో .. టాటులతో ఎంత పాపులర్ అయ్యాడో బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో మాటతో గెటప్ తో మరింత పాపలర్ అయ్యాడు..లోబో గతంలో కారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ ప్రమాదానికి కారణం అయ్యాడు.ఈ కారు ప్రమాదంలో ఇద్దరు మరణించారు పలువురు గాయపడ్డారు..
ఈసమయంలో లోబో కూడా గాయపడ్డాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈకేసు విచారణ పూర్తి అయింది. లోబో అలియాస్ ఖయూమ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు విని ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
*సంఘటన వివరాలు చూస్తే *
2018 మే 21 వ తేదిని ఓఛానల్ వారు షూటింగ్ కోసం లోబోని తీసుకువెళ్లారు .. లోబో టీం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం ఇలాంటి ప్రముఖ ప్రాంతాల్లో షూటింగ్ చిత్రీకరించారు.
ఇక తిరుగుప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కారులో వస్తున్నారు ఈ టీమ్. ఈ సమయంలో కారు లోబో డ్రైవ్ చేస్తున్నాడు. కారు రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది.
ఈ సమయంలో కారు వేగంగా వెళుతోంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు.. వెంటనే స్ధానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు వారు ఇద్దరు మరణించారు.
ఆటోలో మిగిలిన ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో లోబోకి మిగిలిన వారికి కూడా గాయాలు అయ్యాయి. లోబో ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.. మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏడు సంవత్సరాల విచారణ తర్వాత తాజాగా తీర్పు వచ్చింది. లోబోకి ఏడాది జైలు శిక్ష విధించింది కోర్ట్..
అంతేకాదు రూ.12,500 జరిమానా కూడా విధించారు నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కి ఈ శిక్ష పడింది..లోబోకి శిక్ష పడటంతో ఈ తీర్పు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
వేగంగా కారు నడపటం చాలా ప్రమాదం. దీని వల్ల ఇద్దరి ప్రాణాలు కూడా కోల్పోవలసి వచ్చింది. గమ్యస్ధానానికి త్వరగా చేరుకోవచ్చని వేగంగా కారునడిపితే ఇలా అనుకోని ప్రమాదాలు జరిగితే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. దయచేసి వేగంగా కారు నడపడం, నిర్ల్యక్షంగా వాహనాలు నడపవద్దని తెలియచేస్తున్నారు పోలీసులు.