Mafia or Market? Apple, Google పై Tim Sweeney విమర్శలు

  • News
  • April 4, 2025
  • 0 Comments

ఆపిల్, గూగుల్ మాఫియా తరహా వ్యాపార సంస్థలు – ఎపిక్ గేమ్స్ సీఈఓ Tim Sweeney విమర్శలు

ఎపిక్ గేమ్స్ సీఈఓ Tim Sweeney, Apple మరియు Google లను తీవ్రంగా విమర్శించారు. ఈ రెండు సంస్థలు “గ్యాంగ్‌స్టర్-స్టైల్ వ్యాపారాలు”గా వ్యవహరిస్తు ఉన్నాయిని

తాము నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, కొన్నిసార్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాయి అని ఆయన ఆరోపించారు.

ఈ పెద్ద టెక్ కంపెనీల విధానాలు ఎపిక్ గేమ్స్ వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తున్నాయని, users ను ఎపిక్ గేమ్స్ స్టోర్ download చేయకుండా భయ పెడుతు ఉన్నాయిని అన్నారు.

ఎపిక్ గేమ్స్ సీఈఓ తీవ్ర విమర్శలు:

టిమ్ స్వీనీ ఇటీవల Y Combinator ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆపిల్, గూగుల్‌లను తీవ్రంగా విమర్శించారు.

“ఈ రెండు సంస్థలు SELF -Rules మార్చుకుంటూ, న్యాయాన్ని పాటించా కుండా వ్యాపారం చేస్తున్నాయి” అని పేర్కొన్నారు.

Users అధికారిక యాప్ స్టోర్లను వదిలి ఇతర యాప్ స్టోర్లను ఉపయోగించకుండా ఆపిల్, గూగుల్ ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు.

Also Read  ఐపీఎల్ 2025: అహ్మదాబాద్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు!

యాప్ డౌన్‌లోడ్‌లో ఆటంకాలు:

Android Users ఎపిక్ గేమ్స్ స్టోర్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించి నప్పుడు, “అజ్ఞాత మూలం” (Unknown Sources) అనే messages వస్తున్నాయి.

ఈ హెచ్చరికల వల్ల దాదాపు 50-60 శాతం మంది Users డౌన్‌లోడ్ ప్రక్రియను అర్థాంతరంగా ఆపేస్తున్నారని స్వీనీ తెలిపారు.

ఐరోపాలో సైడ్‌లోడెడ్ యాప్ స్టోర్లను అనుమతించే కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ, ఆపిల్ ఇంకా Users భయపెట్టే విధంగా Messages display చేస్తున్నది.

ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్ ఫీజులపై విమర్శలు:

ఆపిల్ మరియు గూగుల్ తమ యాప్ స్టోర్లపై “30 శాతం టారిఫ్” విధిస్తున్నాయని స్వీనీ ఆరోపించారు. ఈ ఫీజులను ప్రభుత్వం విధించే టారిఫ్‌లకు సమానంగా పోల్చారు.

చైనా వస్తువులపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లను పెంచాలని అనుకుంటే, ఆపిల్, గూగుల్ తమ యాప్ స్టోర్ నిబంధనలను సడలించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

న్యాయపరమైన పోరాటం:

ఎపిక్ గేమ్స్ గతంలో ఆపిల్, గూగుల్‌లపై చట్టపరమైన పోరాటం చేసింది. గూగుల్‌పై న్యాయపరమైన కేసులో ఎపిక్ గెలిచినప్పటికీ, ఆపిల్‌పై మాత్రం విజయం సాధించలేకపోయింది.

Also Read  నికోలస్ పూరన్ IPL 2025లో సరికొత్త రికార్డ్

అయినప్పటికీ, కోర్టు ఆపిల్‌కు యాప్ స్టోర్ పోటీని అనుమతించాలని ఆదేశించింది. అయితే, ఎపిక్ ప్రకారం, ఆపిల్ చట్టాన్ని పూర్తిగా పాటించడం లేదని,

తమ సొంత చెల్లింపు వ్యవస్థలను ఉపయోగించే డెవలపర్ల కోసం కేవలం 3% మాత్రమే కమీషన్ తగ్గించిందని విమర్శించారు.

చిన్న డెవలపర్లకు అడ్డంకులు:

ఆపిల్ “కోర్ టెక్నాలజీ ఫీజు” పేరిట ఏటా 50 సెంట్లు ప్రతీ యాప్ ఇన్‌స్టాల్‌కు వసూలు చేస్తోంది. ఇది చిన్న డెవలపర్లకు నష్టం కలిగించే విధంగా ఉందని స్వీనీ తెలిపారు.

ఫ్రీ-టు-ప్లే గేమ్స్‌ను అభివృద్ధి చేసే సంస్థలు, ఈ అధిక వ్యయాల వల్ల దివాళా తీసే అవకాశం ఉందని అన్నారు.

మరింత పోటీ కోసం ప్రయత్నాలు:

ప్రస్తుతం ఎపిక్ గేమ్స్ స్టోర్‌లో ప్రధానంగా పాత గేమ్స్ మాత్రమే లభిస్తున్నాయి. అయితే, త్వరలోనే కొత్త డెవలపర్ల కోసం ఈ స్టోర్‌ను తెరవనున్నట్లు స్వీనీ తెలిపారు.

iOS మరియు Android ప్లాట్‌ఫామ్‌లపై కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

స్వీనీ గత వ్యాఖ్యలు:

Also Read  Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

ఇది మొదటిసారి కాదు, 2021లో కూడా స్వీనీ గూగుల్‌ను “క్రేజీ” అని, “ఆపిల్‌ను నిలిపివేయాలి” అని వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాలో జరిగిన సమావేశంలో, క్రాస్-ప్లాట్‌ఫామ్ యూనివర్సల్ యాప్ స్టోర్ అభివృద్ధి చేయాలని ఎపిక్ లక్ష్యంగా పెట్టుకుంది.

అదే ఏడాది, దక్షిణ కొరియా ప్రభుత్వం థర్డ్-పార్టీ చెల్లింపు వ్యవస్థలను అనుమతించే చట్టాన్ని అమలు చేసింది. అయితే, స్వీనీ మాటల్లో, పెద్ద టెక్ సంస్థలపై గట్టిగా చర్యలు తీసుకున్నప్పుడే నిజమైన మార్పు వస్తుందని చెప్పారు.

ముగింపు:

టిమ్ స్వీనీ ఆపిల్, గూగుల్‌లపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, పెద్ద టెక్ కంపెనీలు చట్టాలను తాము అనుకూలంగా మార్చుకుంటూ, చిన్న వ్యాపారాలను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ, ఈ పరిస్థితిని మార్చడానికి మరింత కఠినమైన నిబంధనలు, కార్యాచరణ అవసరమని స్వీనీ అభిప్రాయపడ్డారు.

  • Related Posts

    • News
    • April 13, 2025
    • 22 views
    Reciprocal Tariffs: పరస్పర సుంకాలును తగ్గించిన ట్రంప్.

    యూఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి డోనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా “Reciprocal Tariff” పెంచడం జరిగింది. కొన్ని వస్తువులైనటువంటి స్మార్ట్ ఫోన్స్ ,లాప్టాప్స్, చిప్స్ వీటన్నిటి మీద ఎటువంటి పాత విదానం ద్వారా Import & Export ఉండనున్నాయి. పలు…

    Read more

    • News
    • April 11, 2025
    • 32 views
    Break -UP: ప్రతీకారాన్నిపార్సిల్ రూపంలో బయటపెట్టిన ప్రియుడు.

    పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు, తన మాజీ Girl friend పై ప్రతీకారం తీర్చు కోవాడానికి, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా దాదాపు 300 (COD) పార్సిళ్లను ఆమె నివాసానికి పంపాడు. బ్రేకప్ తర్వాత ‘ప్రతీకారం’ తీసుకోవాలని భావించిన…

    Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *