ఈ రోజుల్లో స్నేహితులని ఇంటికి రమ్మంటే కొందరు చేసే దుశ్చర్యలు మాటల్లో చెప్పలేనివి, స్నేహితుడి భార్య అంటే చెల్లి అక్కలా భావించాలి. అందంగా ఉంటే వారిపై కూడా కామాంధులు కన్నేస్తున్నారు. తాజాగా యూపీలో దారుణం జరిగింది. ఏ భర్త చేయని పని ఓ వ్యక్తి చేశాడు. ఆ ఇల్లాలి బాధ వర్ణనాతీతం. మన్నార్ గంజ్ ప్రాంతానికి చెందిన రంజిత ముఖేష్ ఇద్దరికి వివాహం అయి 8 నెలలు అయింది. ముఖేష్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే ముఖేష్ కి విరాట్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇటీవల ముకేష్ ఇంటికి విరాట్ వచ్చాడు, అయితే ముఖేష్ భార్య చాలా అందంగా కనిపించింది, ఎలాగైనా ఆమెని అనుభవించాలి అని అనుకున్నాడు.
కొద్ది రోజుల తర్వాత విరాట్ ముఖేష్ ఇద్దరు మద్యం తాగారు, ఇదే సరైన సమయం అని తనకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అన్నాడు విరాట్, అంతేకాదు ఆ కోరిక తీరిస్తే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు స్నేహితుడితో. ఆ కోరిక ఏమిటి అని అడిగాడు ముఖేష్ .. నీ భార్య తో నాకు గడపాలి అని ఉంది అని తన కోరిక బయటపెడ్డాడు, అయితే డబ్బు పై పిచ్చ ఉన్న ముఖేష్ నాకు రెండు లక్షలు ఇస్తే నీ కోరక తీరుస్తా అన్నాడు.
చివరకు ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి తన భార్యకు ఐస్ క్రీమ్ ఇచ్చాడు ముఖేష్..ఆమెకు తెలియకుండా అందులో మత్తు మందు కలిపాడు. అయితే ఆమె ఐస్ క్రీమ్ తిన్న వెంటనే మత్తులోకి వెళ్లింది. ఆ తర్వాత విరాట్ ని ఇంటికి పిలిచి ఆమెతో గడపమన్నాడు. చివరకు ఆమెకి మత్తు వదిలిన తర్వాత ఆమెకి జరిగిన ఘోరం అర్దం అయింది.
వెంటనే ఆమె తన సోదరుడికి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడంతో వారి సాయంతో ఆమె విరాట్ ముఖేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడడుగులు నడిచి చివరి వరకూ తోడుగా ఉంటాను అని పెళ్లి చేసుకున్న భర్తే, ఇలా ఆమె శీలాన్ని అమ్మేస్తే ఇక ఆమెకి ఎక్కడ భద్రత ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు స్ధానికులు.