“మన శంకర వరప్రసాద్ గారు” సినిమా రిలీజ్‌కి ముందే మంచి బిజినెస్ చేసేసింది. ముఖ్యంగా non-theatrical హక్కులు భారీ రేట్ కు అమ్మేశారు.. Zee Group సంస్థ ₹50 కోట్ల వరకి కొన్నది అని సినీ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్.
ఈ రోజుల్లో మార్కెట్ పరిస్థితులు చూస్తే, Zee లాంటి పెద్ద గ్రూప్ ఇలా ముందుకి రావడం అంటే సినిమా మీద వాళ్లకు మంచి నమ్మకం ఉందన్న మాట.
సింపుల్‌గా చెప్పాలంటే సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలకు సేఫ్ అయింది
పెట్టిన డబ్బులో పెద్ద భాగం వచ్చేసినట్టే.
ఇక Zee Group సంగతి చూస్తే, వాళ్లు సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలకే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా బాగుంటుందనే అంచనా పెరిగింది. ఇప్పుడు మిగిలింది థియేటర్లలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేస్తారన్నదే. సినిమా అనేది ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమా లెక్కలు ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది.