కొన్ని నెలల క్రితం మంచు వారి కుటుంబ వివాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ చర్చించుకున్నారు. మంచు మనోజ్, విష్ణు, మంచు మోహన్ బాబు ఈ కుటుంబ గొడవలతో పోలీసు కేసుల వరకూ వీరి వ్యవహారం వెళ్లింది.
మనోజ్ ని ఇంటి నుంచి కూడా బయటకు పంపించేశారు. ఈ వివాదం తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు ఇరువురు. తర్వాత మనోజ్ బైరవం సినిమా చేశారు, మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు కన్నప్ప సినిమా విడుదల చేశారు.
కన్నప్ప చిత్రం ప్రేక్షకులని అలరించింది.ఈ సినిమాలో విష్ణు తనయుడు మంచు అవ్రామ్ వెండితెరకు పరిచయం అయ్యారు.ఈ సమయంలో కన్నప్పలో సినిమాలో అవ్రామ్ నటనకు సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ప్రత్యేక అవార్డు లభించింది.
ఈ సమయంలో అవ్రామ్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు, దీనికి ఆయన బాబాయ్ మనోజ్ స్పందించారు.
ఈ అవార్డు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. మళ్లీ మీ ముందుకు వస్తా అంటూ
అవ్రామ్ తెలియచేశాడు. ఈ అవార్డు రావడం పై మనోజ్ ప్రశంసలతో పోస్ట్ పెట్టారు.
అవ్రామ్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.కంగ్రాట్స్ అవ్రామ్ నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి అని తెలిపారు.
అంతేకాదు నాన్న. విష్ణు అన్న, నాన్న మోహన్‌బాబుగారితో కలిసి నువ్వు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం అంటూ మనోజ్ అన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ వీడియో వైరల్ అవుతున్నాయి.
మంచు అభిమానులు ఇన్నాళ్లకు వీరి మధ్య గొడవలు సర్దుమణిగాయి అని ఆనందపడుతున్నారు. ఇలాగే మంచు బ్రదర్స్ కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. అందరికి అదే కదా కావాల్సింది, గొడవలతో ఏం కలిసి వస్తుంది. నలుగురితో చక్కగా కుటుంబం ఉంటే అదే ఎంతో ఆనందం.