మార్వాడీ గో బ్యాక్ నినాదం తెలంగాణలో కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది, అయితే దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మన దేశంలో పుట్టి పెరిగిన వారికి ఇవన్నీ కూడా హక్కు అనే చెప్పాలి. అయితే మార్వాడి వారి వ్యాపార స్టైల్ కొంత వేరుగా ఉంటుంది.
స్ధానిక వ్యాపారులు రెండు రూపాయల లాభంతో రెండుసార్లు రొటేషన్ చేసి నాలుగు రూపాయల లాభం సంపాదిస్తే… వాళ్ళు రూపాయి లాభంతో అదే పెట్టుబడిని పదిసార్లు రొటేషన్ చేసి పది రూపాయల లాభం సంపాదించగలరు.
కంపెనీలు ఇచ్చే స్కీమ్ డిస్కౌంట్లలో చాలా తక్కువ ప్రాపిట్ తోనే ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. దీని వల్ల మీడియంగా వ్యాపారం చేసేవారికి చాలా ఇబ్బంది అవుతోంది. అయితే బయటమీద ఒక రూపాయి వారి దగ్గర ధర తక్కువ ఉంటంతో స్దానిక వ్యాపారుల దగ్గర కాకుండా మార్వాడిల దగ్గర చాలా మంది వస్తువులు కొంటున్నారు.
ఇదే స్దానిక వ్యాపారులకు ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా కిరాణా, ఫ్యాన్సీ, సోప్స్, ప్లాస్టిక్ ఐటెమ్స, డెకరేషన్ ఐటమ్స్, బంగారం, అలాగే ఐరన్ ,స్టీల్, ప్లంబింగ్ ఐటమ్స్ ఈ వ్యాపారాల్లో భారీగా పోటీ నెలకొంది. అయితే హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన వారిపై మరింత వ్యతిరేకత పెంచింది..ఉద్యమాలకు పురిటి గడ్డ తెలంగాణలో ఈ కొత్త ఉద్యమం పురుడుపోసుకుంది
సికింద్రాబాద్ మార్కెట్ లో ఇటీవల దళిత యువకుడిపై స్థానిక మార్వాడీ వ్యాపారులు దాడి చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. అయితే కారు పార్కింగ్ దగ్గర గొడవ మొదలైందని ఇలా మార్వాడీలు దాడిచేశారు అంటూ తెలియచేస్తున్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యాపారం చేసుకుంటూ, ఇక్కడ పుట్టి పెరిగిన వారిపై ఇలా దాడి చేస్తారా అంటూ? తెలంగాణలో కొందరు ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా, దీనికి తోటి వ్యాపారులు కూడా మద్దతు ఇస్తున్నారు.
యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈ ఘటన తర్వాత రచయిత, గాయకుడు గోరేటి రమేష్ మార్వాడీల దోపిడిని వివరిస్తూ పాటపాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట కూడా పెద్దగా వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు అయింది.
సోమవారం రంగారెడ్డి జిల్లా అమన్ గల్ బంద్ కు దారి తీసింది ఈ ఘటన. ఈ వివాదం ఇపుడు రాజకీయ రంగు పులుముకుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మార్వాడీలకు మద్దత్తుగా నిలబడ్డాయి. ఇక రాష్ట్రంలో మరో ముఖ్యమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకా దీనిపై స్పందించలేదు
నీతిగా న్యాయంగా తక్కువ ధరకు మార్కెట్లో వస్తువులు అమ్ముతున్నాము, మాది తప్పు ఏమి ఉంది అని మార్వాడీలు ప్రశ్నిస్తున్నారు. మేము ఏమీ వేరే బ్రాండ్ అమ్మడం లేదు అందరూ అమ్మేదే అమ్ముతున్నాం, బయట 5 రూపాయలు వారు లాభం వేసుకుంటే మేము 2 రూపాయల లాభానికి అమ్ముతున్నాం. ఎవరి వ్యాపారం స్టైల్ వారిది అని అంటున్నారు మార్వాడీలు.