తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన IANSకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘మేరీ కోమ్‌కు ఓ జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు సర్దిచెప్పినా ఆమె తీరు మారలేదు. ఒకసారి కాదు, మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లాంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఒంటరిగా జీవిస్తూ అక్రమ సంబంధాలు కొనసాగించాలని ఆమె కోరుకుంది. అందుకే విడాకుల నిర్ణయం తీసుకుంది’ అని ఆయన తెలిపారు.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో మేరీ కోమ్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇద్దరి మధ్య నడుస్తున్న న్యాయపోరాటం మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మేరీ కోమ్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.