క్రికెట్ గాడ్ సచిన్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటి వాడు కానున్నారు తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయనకు ఎంగేజ్ మెంట్ జరిగింది.
అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. అర్జున్ టెండూల్కర్ ఇటీవల సానియా చందోక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సచిన్ కు కోడలు అవుతున్నారు అంటే కచ్చితంగా వారిది పెద్ద ఫ్యామిలీ అయి ఉంటుందిమరి ఆమె కుటుంబం గురించి చాలా మంది తెలుసుకుంటున్నారు.
సానియా చందోక్ గురించి వివరాలు తెలుసుకుందాం.
సానియా చందోక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ చేశారు. ఇక వారి తాతయ్య ముంబైలో ప్రముఖ వ్యాపారవేత్త. తండ్రి కూడా వ్యాపారంలోనే ఉన్నారు.
ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబంగా వారికి పేరు ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా చందోక్. ఆమె కూడా చదువు పూర్తి చేసిన తర్వాత వ్యాపారంలోకి వచ్చారు.
ముంబైలోని మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పిలో డైరెక్టర్‌గా ఆమె కొనసాగుతున్నారు. వీరి కుటుంబానికి హోటల్స్ ఫుడ్ రంగంలో చాలా పేరు ఉంది.
ఆమె తాత రవి ఘై ఇంటర్‌కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమెరి ఐస్ క్రీమ్ ఈ వ్యాపారాలు చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు వారికి ఉన్నాయి.
ముంబైలో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ కూడా వారిదే .. ఆమె కూడా స్వంతంగా పైకి రావాలనే అభిరుచితో మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పి కంపెనీ పెట్టారు.
సుమారు కోటి రూపాయలతో దీనిని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ జంటకి ఎంగేజ్ మెంట్ జరిగింది.. త్వరలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయనున్నారు, విదేశాల్లో వివాహం చేయాలి అని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుంది అని బీ టౌన్ మీడియా తెలియచేస్తోంది.