గత వారం త్రిబాణధారి బార్బరిక్ సినిమా రిలీజ్ అయింది అయితే సినిమా కొంత మందికి నచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని రివ్యూలు వచ్చాయి. కాని ఈ సినిమా చూసేందుకు పెద్దగా ప్రేక్షకులు దియేటర్లకు రావడం లేదు. దీనిపై దర్శకుడు మోహన్ శ్రీవత్స చాలా బాధపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. తన చిత్రం చూసేందుకు ఎవరూ థియేటర్లలోకి రావట్లేదని బాధపడుతూ చెప్పుతో కొట్టుకున్నారు. ఈ వీడియో చూసి చాలా మంది బాధపడ్డారు. కొంత మంది ఈ సినిమా చూశాము చాలా బాగుంది అని తెలిపారు. అయితే అనుకున్నంత రెస్పాన్స్ కలెక్షన్స్ ఈ సినిమాకి రాలేదు. తాజాగా ఈ దర్శకుడు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం తీసిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సందడి చేస్తోంది. త్రిబాణధారి బార్బరిక్ మూవీతో పాటు ఈ సినిమా గురించి కూడా బజ్ క్రియేట్ అయింది.
డైరెక్టర్ మోహన్ శ్రీవత్స కరణ్ అర్జున్ అనే సినిమా తీశాడు. ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే చాలా మందికి ఈ సినిమా వచ్చింది అనే విషయం కూడా తెలియదు. 2022 జూన్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.. ఈ సినిమాలో పెద్దగా స్టార్స్ లేకపోవడంతో కంటెంట్ కూడా ఆకట్టుకోలేదు పెద్దగా బజ్ కనిపించలేదు. దియేటర్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. రెంట్ విధానంలో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది.
ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కరణ్ అర్జున్ – కరణ్ నిఖిల్ కుమార్ తనకు కాబోయే భార్య వృషాలి తో వివాహానికి సిద్దం అవుతాడు ..ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్‌లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళ్తారు ఈ జంట. అయితే ఈ సమయంలో అభిమన్యు అర్జున్ వీరిద్దరిని వెంటాడతాడు. వీరిని చాలా ఇబ్బందులకి గురిచేస్తాడు. అయితే ఒకసారి ఏకంగా తుపాకితో కాల్చడానికి ప్రయత్నిస్తాడు. చివరకు వారిద్దరు అర్జున్ నుంచి తప్పించుకుంటూ ఎడారి ప్రాంతంలో ఎన్నో ఇబ్బందులు పడతారు. అసలు అర్జున్ వీరిని ఎందుకు వెంటాడుతాడు, వీరిద్దరికి జరిగిన గొడవ ఏమిటి, అసలు కారణం ఏమిటి ఇవన్నీ తెలియాలి అంటే కరణ్ అర్జున్ సినిమా చూడాల్సిందే.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఈ సినిమాని అప్పట్లో మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు. అయితే అనుకున్నంత రెస్పాన్స్ దియేటర్లో సంపాదించలేదు, తాజాగా ఓటీటీలో పర్వాలేదు అనే టాక్ సంపాదించుకుంది ఈ దర్శకుడు బాగానే సినిమా తీశారు అని అంటున్నారు. మనం గతంలో కూడా చాలా సినిమాలు ఇలా చూశాం, ధియేటర్లో ఫెయిల్ అయి ఓటీటీలో సక్సస్ అయ్యాయి. తాజాగా కరణ్ అర్జున్ కూడా బాగుంది అంటూ కొందరు సపోర్ట్ గా కామెంట్లు పెడుతున్నారు.
తాజా ఇంటర్వ్యూలో డైరక్టర్ ఏమన్నారంటే
ఇక ఇటీవల తన సినిమాకి పెద్దగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో దర్శకుడు మోహన్ శ్రీ వత్స చాలా ఎమోషనల్ అయ్యారు..సత్యరాజ్, ఉదయభాను,సత్యం రాజేశ్ వీరందరూ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో.
సినిమాకి, 10 మంది కూడా రాకపోవడం పట్ల ఆయన చాలా బాధపడ్డారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏదైనా సినిమాకి ఓ 30 నుంచి 40 మంది వచ్చి చూస్తే, సినిమా టాక్ బయటకు వెళుతుంది. అదే షోకి పది మంది కూడా లేకపోతే షో వేయరు క్యాన్సిల్ అవుతుంది. సినిమా చాలా బాగా తీశాము. కానీ ఎక్కడ తప్పు జరిగింది అనేది అర్దం కావడం లేదు అని బాధపడ్డారు .మా నిర్మాత మొదలు చాలామంది కాల్ చేసి నాకు ధైర్యం చెప్పారు. సినిమాని బాగా ప్రమోట్ చేశాను అని ఇంటర్వ్యూలో బాధపడ్డారు.