ప్రతీ వారం కొత్త సినిమాలు దియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సందడి చేస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ నుంచి ప్రసారంకి వచ్చిన షార్ట్ ఫిలిమ్ మౌనమే నీ భాష.. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా అలరించింది అనేది రివ్యూలో చూద్దాం.
నటులు- రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్, గాయత్రీ, రాజా రాంబాబు,
దర్శకుడు – వరా ముళ్లపూడి
నిర్మాతలు- విశ్వాస్ హన్నూర్కర్, రాఘవేంద్ర వర్మ
సంగీతం : సాయి మధుకర్
మౌనమే నీ భాష అచ్చ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పాలి. రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్ భార్యాభర్తలుగా చాలా చక్కగా నటించారు. ఈ సినిమాలో ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సినిమా పూర్తిగా చూస్తే మనసు బరువెక్కుతుంది.
స్టోరీ వైజ్ చూస్తే
అది ఒక చిన్న గ్రామం అక్కడ రామభద్రయ్య – సుభద్ర భార్య భర్తలు, అన్యోన్య దాంపత్య జీవితం. వారి పిల్లలు సిటిల్లో సెటిల్ అవుతారు. ఇక ఒక రోజు సుభద్ర పుట్టిన రోజున పిల్లలు తల్లిని కనీసం విష్ చేయరు. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని కనీసం పట్టించుకోరు. ఏడాదికి ఒకసారి కూడా రావడం లేదని చివరకు రామభద్రయ్య తన పిల్లలను ఇంటికి రప్పించేందుకు ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్టే పిల్లలు వస్తారు.
కానీ ఇంతలో రామ భద్రయ్యకి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగి మంచాన పడతాడు. అక్కడ నుంచి ఈ మూవీ టర్న్ అవుతుంది. తండ్రిని ఆ తర్వాత ఎలా చూస్తారు, ఇక భార్య భర్తలు అనుబంధం ఎలా పెరిగింది, చివరకు పిల్లలు తల్లిదండ్రులని ఎలా చూశారు, ఇవన్నీ తెలియాలంటే ఈ షార్ట్ ఫిలిమ్ లో చూడాల్సిందే.
శ్రీ కాళీ పట్నం రామారావు గారు రచించిన సంకల్పం అనే రచన ఆదారంగా ఈ షార్ట్ ఫిలిమ్ తెరకెక్కింది.
కుటుంబం పిల్లలు తండ్రి మధ్య ఎమోషన్ బాగా ఆకట్టుకుంది.
పిల్లలు తల్లిదండ్రులకి అస్సలు సమయం కేటాయించడం లేదు, దీనిని అర్దవంతంగా చూపించారు.
జీవితం ఇచ్చిన తల్లిదండ్రులని చివరి రోజుల్లో అలా వదలడం కూడా కరెక్ట్ కాదు అనేది దర్శకుడు అత్యద్భుతంగా చూపించారు.
రాజీవ్ కనకాల, నటి ప్రమోదిని దంపతులుగా నటించారు అనడం కాదు జీవించారు అనే చెప్పాలి. ఆ పాత్రల్లో
ఎమోషన్స్ మాత్రం ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచాయి. అలాగే నేపథ్య గీతాలు బాగున్నాయి. ముఖ్యంగా ఒకరికి ఒకరు తోడుగా చివరి రోజుల్లో వారి అవసరం ఎంత ఉంటుందో బాగా చూపించారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. మధుకర్ ఇచ్చిన సంగీతం బాగుంది.. సినిమా కుటుంబం మధ్య మాత్రమే జరుగుతుంది కానీ వాస్తవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు వరా ముళ్ళపూడి ఈ షార్ట్ ఫిలిమ్ ని చక్కగా ప్రెసెంట్ చేశారు.
ఫైనల్ గా*
మౌనమే నీ భాష షార్ట్ ఫిలిమ్ ఒక బలమైన ఎమోషన్స్ తో బరువెక్కే ఎపిసోడ్.