బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది ప్రస్తుతం వరుస పెట్టి సినిమా అవకాశాలు అందుకుంటోంది. అయితే తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నారు.
దీని గురించి పెద్ద ఎత్తున బీ టౌన్ నుంచి సౌత్ ఇండియా వరకూ సినిమా ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో మృణాల్ ఠాకూర్
ఒక ఇంటర్వ్యూలో నటి బిపాసా బసుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె వ్యాఖ్యాలపై నెటిజన్లు కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఇంత వివాదం అవ్వడం పై మృణాల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా క్షమాపణలు తెలిపారు. అయితే ఆనాడు మృణాల్ ఏమి అన్నారు అనేది చూస్తే బాలీవుడ్ అందాల భామ బిపాసా కంటే తాను అందంగా ఉంటాను అని అన్నారు.
అంతేకాదు ఆమె కండలు తిరిగిన పురుషుడిలా ఉంటుంది అని కామెంట్ చేసింది. ఇదే చాలా మందికి బాధ కలిగించింది. ఇక బాలీవుడ్ లో చాలా మంది మృణాల్ బాడీ షేమింగ్‌గా మాట్లాడింది అని అన్నారు.
దీనిపై మృణాల్ క్షమాపణలు తెలిపింది. మృణాల్ మాట్లాడుతూ తనకు అప్పుడు 19 ఏళ్లు ఆ సమయంలో నేను సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇవి. దానికి ఇలా అంటున్నారు నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే వారికి క్షమాపణలు అంటూ తెలియచేశారు.
శరీర సౌందర్యం అంటే ఏమిటో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది అంటూ భావోద్వేగపూరితంగా తెలియచేశారు, అయితే మృణాల్ వ్యాఖ్యల పై బిపాసా కూడా స్పందించింది.
మహిళలంతా శారీరకంగా బలంగా ఉండాలి. మగాళ్లా కనిపించకూడదనే పాత ఆలోచనల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది అని ఆమె కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
మృణాల్ సారీ చెప్పడంతో అభిమానులు కూడా ఇక్కడితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని అంటున్నారు.