నాడా (National Anti Dopping Agency) అనేది ప్రతి అథ్లెట్ కోసం పని చేస్తుంది —
క్రీడా కారులు ఏ క్రీడలో ఉన్నా, ఏ సంఘంతో ఉన్నా, ఏ ప్రత్యేకత కలిగిఉన్నా NADA కు ఏటువంటి తేడా ఉండదు. NADA దృష్టిలో ప్రతి అథ్లెట్ ఒక్కరే.
న్యాయంగా పోటీలకు ప్రోత్సాహం ఇవ్వడం, క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడమే NADA యొక్క పని. NADA చేసే సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి.
నాడా ఇండియా, వాడా (WADA- – World Anti Dopping Agency ) మరియు ఇతర జాతీయ యాంటీ డోపింగ్ సంస్థలతో కలిసి క్రీడా పద్ధతులను బలోపేతం చేయడానికి,
మారుతున్న మార్గదర్శకాలను అభివృద్ధి చేయడంలో సహకరించేందుకు మరియు అథ్లెట్లు ప్రపంచవ్యాప్తంగా సమానమైన పోటీ స్థాయిలో పోటీపడగలుగుతూ ఉంటే వారు, NADA చర్యలు చేపడుతుంది.
భారత అథ్లెటిక్ రంగాన్ని వరుస డోపింగ్ కేసులు వెంటాడుతున్నాయి.
జూనియర్ జాతీయ బృందానికి ప్రధాన కోచ్‌గా ఉన్న రమేష్ నాగపూరిని డోపింగ్‌లో “పాలుపంచుకున్నట్లు” నిర్థారించడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది.
అలాగే ఏడుగురు అథ్లెట్లు డోప్ పరీక్షల నుంచి తప్పించుకున్నారని పీటీఐ నివేదికలో పేర్కొంది.
ఇక మరొద్దురు కోచ్‌లు — కరంవీర్ సింగ్, రాకేష్‌లను కూడా నాడా సస్పెండ్ చేసింది.
వీరిలో ఒకరు డోపింగ్‌లో సహకరించినట్లు, మరొకరు నిషిద్ధ పదార్థాల వాడకాన్ని నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నాడా తాజాగా విడుదల చేసిన డోప్ ఉల్లంఘనల జాబితాలో పరీక్షల నుంచి తప్పించుకున్న ఏడుగురు అథ్లెట్ల పేర్లు :
పారస్ సింఘాల్, పూజా రాణి, నలుబోతు శణ్ముగ శ్రీనివాస్, చెలిమి ప్రతూష, శుభం మహారా, కిరణ్, జ్యోతి.
రమేష్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయి) కేంద్రంలో అథ్లెటిక్ కోచ్‌గా పనిచేస్తున్నారు.
2023లో ఆయనను జాతీయ అథ్లెటిక్ ఫెడరేషన్ జూనియర్ చీఫ్ కోచ్‌గా నియమించింది. అలాగే ఇయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా.
రమేష్‌ను గతంలో అద్భుతమైన అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ముఖ్యంగా జ్యోతి యెర్రారి, అలాగే గతంలో డ్యూటీ చంద్‌ను వారి తొలి ఒలింపిక్స్ ప్రదర్శనకు గైడ్ చేశారు.
ఆ సమయంలో డ్యూటీపై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ (IAAF) హైపరాండ్రోజెనిజం నియమాలు కారణంగా అంతర్జాతీయ స్థాయిలో నిషేధం విధించబడింది.
ఇందులో విశేషం ఏమిటంటే, ఇటీవలే అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) దేశంలోని అన్ని కోచ్‌లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది.
ఎందుకంటే, “డోపింగ్‌లో కోచ్‌ల ప్రమేయం ఉన్నదనే” విషయాన్ని వారు అంగీకరించారు.
గత జనవరిలో చండీగఢ్‌లో జరిగిన Annual Meeting లో, దేశంలోని అర్హత ఉన్న, లేని ప్రతి కోచ్ ,
ఈ సీజన్ నుంచి ఫెడరేషన్ పోర్టల్‌లో తమ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా AFI నిర్ణయం తీసుకుంది.
పోటీలు నిర్వహించే జాతీయ సంస్థ ఆధీనంలో శిక్షణ ఇవ్వాలంటే ఇది తప్పనిసరిగా చేయాలి అని AFI (Athelatic Fedration Of India) చెప్పింది.
AFI ఈ సమాచారాన్ని నాడా మరియు వరల్డ్ అథ్లెటిక్స్ ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (AIU)తో పంచుకుందని నివేదికలో పేర్కొంది.