పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అంటే తెలియని వారే ఉండరు, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న లీడర్, ఆయన ఇంట శుభకార్యం జరిగింది ఈ కార్యక్రమానికి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ హాజరయ్యారు… మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఆయన హాజరయ్యారు. పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకకు లోకేశ్ తో పాటు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కాబోయే వధూవరులు శ్రీజ, పవన్ ను లోకేశ్ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మంత్రులతో పాటు కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, శాసనమండలి ఛైర్మన్ మోషెన్ రాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరయ్యారు. ఐటీ మంత్రి లోకేష్ కి భారీ స్వాగతం పలికారు తెలుగు తమ్ముళ్లు, అంతేకాదు లోకేష్ కు గజమాలతో స్వాగతం పలికారు.
నారాలోకేష్ మంత్రి రామానాయుడు చాలా స్నేహంగా ఉంటారు, అయితే స్టేట్ లో చూసుకుంటే
ఏ పొలిటికల్ లీడర్ ప్రతీ రోజు పసుపు దుస్తులతో కనిపించరు. కానీ రామానాయుడు మాత్రం పసుపు షర్ట్ తోనే కనిపిస్తారు, పాలకొల్లు, విజయవాడ, దిల్లీ ఎక్కడకు వెళ్లినా ఆయన పసుపు షర్ట్ వైట్ ఫ్యాంట్ తోనే కనిపిస్తారు
అయితే ఈ రోజు ఆయన కుమార్తె ఎంగేజ్ మెంట్ ఈ రోజు కూడా ఆయన డ్రెస్సింగ్ ఈ విధంగానే ఉంది.
పసుపు బట్టలతోనే ఆ వేడుకను పూర్తి చేశారు,
మంత్రిలోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు, ఈరోజు కూడా పసుపేనా అంటూ సరదాగా రామానాయుడిని ప్రశ్నించారు. ఈ కాబోయే జంటకి పెద్ద ఎత్తున ఆశీస్సులు అందించారు లీడర్లు ప్రజలు.