
జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణ మండలి (NCERT) 2025-26 విద్యా సంవత్సరం నుంచి IV, V, VII మరియు VIII తరగతి పిల్లలకు కొత్త పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామని ప్రకటించింది.
ఈ పుస్తకాలను ప్రచురించడానికి సంవత్సరం క్రితమే NCERT ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే, పుస్తకాలు సమయానికి పూర్తి చేయడంలో విఫలమైంది, ఇది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే గత ఏడాది కూడా III మరియు VI తరగతుల పాఠ్య పుస్తకాల విడుదల ఆలస్యం అయింది.
ఆ అకడెమిక్ సంవత్సరానికి ఏప్రిల్‌లో తరగతులు ప్రారంభమైనప్పటికీ, VI తరగతి గణిత శాస్త్రం మరియు సామాజిక శాస్త్ర పుస్తకాలు ఆగస్టులో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
ఈ ఏడాది కూడా అన్ని పాఠశాలలు గత వారం కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాయి. కానీ ఇప్పటివరకు NCERT కేవలం IV తరగతికి హిందీ మరియు ఇంగ్లీష్ పుస్తకాలు, VII తరగతికి ఇంగ్లీష్ పుస్తకం మాత్రమే విడుదల చేసింది.
VII తరగతికి హిందీ పుస్తకం ఇంకా విడుదల కాలేదు. ఈ పుస్తకాలు NCERT వెబ్‌సైట్‌లో కూడా ఇంకా అప్‌లోడ్ కాలేదు.
IV, V, VII మరియు VIII తరగతుల కోసం మరే ఇతర కొత్త పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. అయితే V మరియు VIII తరగతుల కోసం అన్ని సబ్జెక్టులకు బ్రిడ్జ్ కోర్సులను NCERT సిద్ధం చేసి, తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
CBSE (NCERT పాఠ్యాంశాలు అనుసరించే బోర్డు) మార్చి 26న విడుదల చేసిన సర్క్యులర్‌లో, పుస్తకాల విడుదలకు గడువు గురుంచి చెప్పింది.
కానీ ఆ ప్రకారం అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఏప్రిల్ 10 లోపు అందుబాటులో ఉండాల్సింది. VII తరగతికి సైన్స్ పుస్తకాలు ఏప్రిల్ 10న, గణిత పుస్తకాలు ఏప్రిల్ 20న అందుబాటులోకి రావాల్సి ఉంది.
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థుల ప్రకారం ఈ పుస్తకాలు సమయానికి రావడం అనుమానమే.
V తరగతికి పుస్తకాలు జూన్ 15 నాటికి, VIII తరగతికి జూన్ 20 నాటికి అందుబాటులోకి వస్తాయని సర్క్యులర్ పేర్కొంది.
పాత పాఠ్యాంశం నుంచి కొత్త పాఠ్యాంశానికి మారటం కోసం విద్యార్థులకు సులువుగా ఉండేందుకు, NCERT V మరియు VIII తరగతులకు బ్రిడ్జ్ కోర్సులు సిద్ధం చేసింది.
ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలలో VII తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి మాట్లాడుతూ, “మా స్కూల్ పాత NCERT పుస్తకాలనే బోధిస్తోంది.
అయితే సిలబస్ మారినట్లయితే పిల్లలకు తేడా వస్తుంది. సమయం పరిమితంగా ఉండగా, కొత్త సిలబస్ ఎలా పూర్తి చేస్తారు?” అని ప్రశ్నించారు.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.