దేశ ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.కేంద్ర ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ శ్లాబ్‌లను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది. ఇకపై 5 శాతం జీఎస్టీ 18 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటాయి. దీని వల్ల దాదాపు వేల రూపాయలు సామాన్యులకి మధ్యతరగతి ప్రజలకు ఆర్దికంగా భారం తగ్గుతుంది. వస్తువులు ట్యాక్స్ తగ్గడంతో మరింత తక్కువ ధరకు వస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏసీలు ఫ్రిజ్ ల వాడకం పెరిగింది. ఇవి కొనే వారికి ఇక భారీగా ఖర్చు తగ్గుతుంది.
అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ కొత్త జీఎస్టీ శ్లాబ్ లు సెప్టెంబర్ 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలు అవుతాయి. అప్పటి వరకూ పాత రేట్లు పన్నులు వసూళ్లు చేస్తారు. 5శాతం శ్లాబులో ఉన్న వస్తువులపై జీరో ట్యాక్స్ విధించనున్నారు.
జీరో ట్యాక్స్ వస్తువులు చూస్తే**
పాలు, పాల ఉత్పత్తులు
శనగలు, పనీర్ఇకపై జీఎస్టీ ఉండదు
పిజ్జా బ్రెడ్ కి కూడా ఇకపై నో జీఎస్టీ
పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్స్,
పిల్లలు ఉపయోగించే రంగులు, మ్యాప్
గ్లోబుల ఏరేజర్స్ను జీరో ట్యాక్స్‌గా చేశారు.
12 శాతం శ్లాబులో ఉన్న మందులను కూడా జీరో జీఎస్టీకి తీసుకువచ్చారు
5 శాతం జీఎస్టీ
వెన్న, నెయ్యి, చీజ్, జామ్‌లు, సాస్‌లు, పాస్తా, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, కొన్ని రకాల జ్యూస్ లు బిస్కెట్లు కోకో ఇవన్నీ కూడా 5 శాతం జీఎస్టీ పరిధిలో ఉంటాయి. ఇక బిస్కెట్లు కోకో ధరలు కూడా తగ్గనున్నాయి.
హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్‌పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, పౌడర్లు కూడా 5శాతం జీఎస్టీలో ఉంటాయి. చెప్పులు, షూ వస్త్రాలు కూడా 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి.
18 శాతం జీఎస్టీ
ఇప్పటి వరకూ 28 శాతంగా ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ ఇకపై 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి
టీవీలు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్ల ధరలు తగ్గుతాయి.
- 40శాతం .జీఎస్టీ*
విలాసవంతమైన వస్తువులు, పొగాకు ఉత్పత్తులు, మసాలా, గుట్కా, పాన్ ఐటెమ్స్, లగ్జరీ హోటల్స్
కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, వీటి ధరలు మరింత పెరుగుతాయి.
1200సీసీ లేదా 1500 సీసీపైన ఉన్న SUVలు,
పెద్ద కార్లు, 350 సీసీ పైన మోటార్ సైకిళ్ల ధరలు భారీగా పెరుగుతాయి.
ఇవి ధనవంతులు కొంటారు కాబట్టి వీటి ట్యాక్స్ లు భారీగానే ఉంచింది ప్రభుత్వం.
ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రివాల్వర్లు, పిస్తోల్‌పై జీఎస్టీ 40 శాతం విధిస్తారు.
అయితే ప్రభుత్వం ఇలా జీఎస్టీ సంస్కరణలు చేయడం శ్లాబ్స్ మార్చడంతో దాదాపు ప్రభుత్వ ఖజానాకి ఏటా 48 వేల కోట్ల ఆదాయం కోల్పోతుందని అధికారులు తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది. వస్తువులకి పన్నులు తగ్గడంతో వినియోగం పెరగడం కొనుగోల్లు పెరిగితే ప్రభుత్వ ఖజానా పెరిగే అవకాశం ఉంటుంది. దసరా దీపావళి పండుగ ముందు ఈ నిర్ణయం ఆర్దిక వ్యవస్ధకి వ్యాపార రంగానికి మరింత బూస్టింగ్ అనే చెప్పాలి.