ఏపీలో ఇటీవల కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులకి పిలుపినిచ్చింది ప్రభుత్వం. లక్షలాది మంది కొత్త కార్డులకోసం అప్లై చేసుకున్నారు. అంతేకాదు పేరు మార్పు తొలగింపు, డిలిషన్, అడ్రస్ మార్చడం ఇవన్నీ కూడా ఎన్నో మార్పులకి అవకాశం ఇచ్చారు.
ఇక రేషన్ కార్డుదారులకి కొత్తగా స్మార్ట్ కార్డులు కూడా అందచేస్తాము అని కూటమి ప్రభుత్వం తెలియచేసింది. అయితే తాజాగా గుడ్ న్యూస్ వినిపించింది ప్రజలకు.
ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ ఉచిత రేషన్ కార్డులను ఇంటింటికీ ఇవ్వబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న కార్డుల రూపంలో ఈ స్మార్డ్ కార్డులు అందరికి ఇవ్వనున్నారు.
ఈ కార్డుపై పూర్తి వివరాలు క్యూ ఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది, ఇంటి యజమాని అందులో ఎంతమంది ఉన్నారు ఇవన్నీ పొందుపరిచారు. ఈ స్మార్ట్ కార్డ్ ఉపయోగించి మీరు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు.
ఈ కార్డులు ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు వచ్చినప్పుడు.. ఇంట్లో అందుబాటులో ఉండి.. కార్డులు తీసుకోవాలి . ఈ విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు, అయితే ఆ సమయంలో లేకపోతే దానిని రేషన్ షాపుల దగ్గర తీసుకోవచ్చు..మీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఇంటి యజమాని ఎవరు ఉంటే వారికి ఈ స్మార్ట్ కార్డు ఇస్తారు. ఈ కార్డ్ ఏటీఎమ్ సైజ్ ఉంటుంది.
ఆగస్టు 25 నుంచి ముందుగా 9 జిల్లాల్లో అందిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఇస్తారు. నాలుగు రోజుల్లో ఈ జిల్లాల్లో అందరికి కార్డులు అందచేస్తారు
రెండో విడత ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకూ ఇస్తారు. ఏలూరు, కాకినాడ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇస్తారు.
మూడో విడతను సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 18 వరకూ ఇస్తారు. అనంతవురం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, పార్వతీవురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఇస్తారు.
నాలుగో విడతను సెప్టెంబర్ 19 నుంచి ఇస్తారు. వైఎస్సార్ కడప, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు జిల్లాల్లో ఇస్తారు.
ఇలా ఏపీ అంతా నాలుగు విడతల్లో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి అందరికి వాటి స్ధానంలో కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తారు.ఆంద్రప్రదేశ్ లో 1 కోటి 45 లక్షల స్మార్ట్ కార్డులు ఇస్తారు. ఏదైనా పథకాలకి మిమ్మల్నిరేషన్ కార్డ్ జిరాక్స్ అడిగితే ఇక పై పాతది కాకుండా కొత్త స్మార్ట్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి. పాత కార్డులు అప్పుడు పనిచేయవు .
ఇక రేషన్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 ఈ టోల్ ఫ్రీ నంబర్ కి సమస్య తెలియచేయవచ్చు ఫిర్యాదురూపంలో.