గత నెల 24న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్ సంపాదించుకుంది. దీంతో ఆయన తదుపరి సినిమా గురించి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ అందరూ చూస్తుంది OG చిత్రం గురించి ..సాహో దర్శకుడు సుజీత్ OG చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
మరి పవన్ కల్యాణ్ ని సుజిత్ ఎలా చూపించనున్నారు అనేదానిపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
OG చిత్రం గురించి ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. డిజిటల్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఉన్న సినిమాల్లో ఈ సినిమా తొలి స్ధానంలో ఉంది..
అయితే తాజాగా OG చిత్రం మొదటి పాట Fire Storm విడుదలైంది ఇది ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ ని కూడా ఆకట్టుకుంది. థమన్ అందించిన మ్యూజిక్ అదిరింది అంటున్నారు.
ఇక త్వరలో రెండో పాట విడుదల చేయనున్నారు మేకర్స్.. దీనిపై తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
పోస్టర్ లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ పోస్టర్ అభిమానులకి బాగా నచ్చింది. వింటేజ్ పవర్ స్టార్ కనిపిస్తున్నారు. టీజర్ ట్రైలర్ పై చర్చలు చూశాం కానీ ఈ పోస్టర్ స్టిల్ పై కూడా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దానికి ఓ బలమైన కారణం ఉంది.
ఈ పోస్టర్ లో బాగా అబ్జర్వ్ చేస్తే, పవన్ కళ్యాణ్ కుడి చేయిపై జపాన్ భాషల్లో మూడు పదాలు టాటూ రూపంలో ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ అసలు దీని మీనింగ్ ఏమిటి అని తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే దీని అర్దం తాజాగా తెలుస్తోంది
మొదటి అక్షరం అర్థం ఇంగ్లీస్ లో ప్రామీస్,
రెండో అక్షరం అర్థం బలం,
మూడో అక్షరం ఫైర్ అర్థం అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కి కచ్చితంగా ఇది లింక్ అయి ఉంటుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు
సెప్టెంబర్ 25, 2025న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఓజీ సినిమా.