Saturday, January 31, 2026
HomeNewsAndhra PradeshP. 4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుఅస‌లు ఈ పీ 4 అంటే ఏమిటి...

P. 4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుఅస‌లు ఈ పీ 4 అంటే ఏమిటి ఏం చేస్తారు

Published on

ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏం చేసినా సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. ఆయ‌న విజ‌న్ ఏ నాయ‌కుడికి ఉండ‌దు. అంద‌రూ మ‌రో 10 ఏళ్ల త‌ర్వాత ఆలోచిస్తే ఆయ‌న 25 ఏళ్ల‌కు 30 ఏళ్ల‌కు ప్ర‌పంచం ఎలా ఉంటుందని ఆలోచిస్తారు. హైద‌రాబాద్ దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహార‌ణ‌.

ఆనాడు వంద‌ల ఉద్యోగాలు వ‌స్తే ఇప్పుడు ల‌క్ష‌లాది ఉద్యోగాల‌కు కేంద్రం అయింది హైద‌రాబాద్. ఐటీఎగుమ‌తుల్లో బెంగ‌ళూరుతో పోటి ప‌డుతోంది ప్ర‌స్తుతం హైద‌రాబాద్.

అయితే తాజాగా పేద‌రికాన్ని త‌గ్గించేందుకు ఏపీలో సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2029 నాటికి ఏపీలో పేద‌రికం లేకుండా చేయ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మ ముఖ్య‌ ఉద్దేశం.

ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు చంద్ర‌బాబు. ఇక ఇప్పుడు కార్య‌రూపం దాల్చింది.

పీ-4 ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే? మ‌న రాష్ట్రంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం దీనిని చేపడుతున్నారు. ముందు నాలుగు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు.

Also Read  NADA: కోచ్‌లను, అథ్లెట్లను సస్పెండ్!

ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీనికి సంబంధించి పేద‌లు ఎవ‌రు ఉన్నారు అనేది ఆయా పంచాయ‌తీలు స‌చివాల‌యాలు పూర్తిగా సిబ్బంది డేటా ద్వారా గుర్తిస్తారు.

పీపుల్‌-ప‌బ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట‌న‌ర్ షిప్ — పీ-4 లో భాగం.. రానున్న నాలుగు సంవ‌త్స‌రాల్లో 20 ల‌క్ష‌ల కుటుంబాల‌ని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకున్నారు.

పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ య‌జ‌మానులు, కోట్ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ చేస్తున్న వ్యాపారులు, అప‌ర కుబేరులు, ఆర్దికంగా బ‌లంగా ఉన్న వారు, విదేశాల్లో ఉన్న ప్ర‌వాసులు, అంద‌రూ కూడా భాగ‌స్వాములు అవ్వ‌నున్నారు, వారి నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది.దాదాపు 13 ల‌క్ష‌ల బంగారు కుటుంబాలు గుర్తించారు. వారిని ద‌త్త‌త తీసుకుని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేలా వారికి 1.40 ల‌క్ష‌ల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు.. వీరంద‌రూ న‌మోదు చేసుకున్నారు. ఆ కుటుంబంలో వారికి ఉపాది క‌ల్పించ‌డం తోడ్పాటు అందించ‌డం కూడా చేస్తారు.

Also Read  కృష్ణాష్టమి త‌ర్వాత ఈ రాశుల వారికి... ప‌ట్టింద‌ల్లా బంగార‌మే....ఈ జాగ్ర‌త్త త‌ప్ప‌నిస‌రి

Latest articles

Gold Murder:బంగారం కోసం వృద్ధురాలి దారుణ హత్య..

బంగారం కోసం వృద్ధురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా హాలియాలో తీవ్ర కలకలం రేపింది....

Blinkit: 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ బంద్..

గిగ్ వర్కర్ల డిమాండ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల ఆన్లైన్ డెలివరీ విధానాన్ని...

Telangana govt:భారీగా బీర్ల ఉత్పత్తి.. కంపెనీలకు ప్రభుత్వ నిర్దేశం

వేసవికాలంలో బీర్లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో వాటి ఉత్పత్తిని మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వేసవిలో రోజుకు...

Mary Kom Divorce:‘జూనియర్ బాక్సర్తో మేరీ కోమ్కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మాజీ భర్త...

Youtuber Anvesh :ట్రావెలింగ్ ఆపేస్తున్నా!

తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు యూట్యూబర్ అన్వేష్ తెలిపారు. “130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర...

Senior citizens : కోసం డేకేర్ సెంటర్లు..

తెలంగాణలోని వృద్ధులకు శుభవార్త. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 37 ‘డేకేర్ సెంటర్లు’ ఏర్పాటు...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...