ప్రముఖ నటుడు సత్యం రాజేష్ హీరోగా నటించిన “పొలిమేర” సిరీస్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. మొదటి భాగం “పొలిమేర 1” 2021లో డిస్నీ+ హాట్స్టార్లో(ఇప్పుడు jio hotstar గా మారింది) విడుదలై భారీ విజయాన్ని సాదించింది. థ్రిల్లింగ్ కథ, అంచనాలుకు మించిన సన్నివేశాలు, సత్యం రాజేష్ నటన — ఈ మూడింటి కలయిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అదే విజయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మరింత శ్రద్ధగా “పొలిమేర 2“ను తెరకెక్కించారు.
“పొలిమేర 2”ను ఈసారి ఓటిటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేశారు. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ, మంచి మౌత్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు దూసుకెళ్లాయి. థ్రిల్లర్ జానర్‌లో ఇంత పట్టు చూపించడం సత్యం రాజేష్ కెరీర్‌లో కొత్త మలుపు అని చెప్పాలి. ప్రస్తుతం “పొలిమేర 2” ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది, ఇంకా కొత్తగా చూసే ప్రేక్షకులు కూడా దానికి మంచి రేటింగ్స్ ఇస్తున్నారు.
ఇప్పుడు ప్రేక్షకులందరి దృష్టి “పొలిమేర 3” మీదే ఉంది. ఈ సిరీస్ మూడో భాగం కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. సమాచారం ప్రకారం, డిసెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభమై, 2026 జూన్ లేదా జూలైలో థియేటర్లలో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. మునుపటి భాగాల కంటే మరింత పెద్ద స్థాయిలో, కొత్త లొకేషన్లలో చిత్రీకరణ జరగనుంది.
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ — “పొలిమేర 3లో కథ మరింత సస్పెన్స్, ఇమోషన్‌తో నిండి ఉంటుంది. మొదటి రెండు పార్ట్స్ చూసిన వారికి ఇది మరో లెవెల్ అనుభవం ఇస్తుంది” అని చెప్పారు.