టాలీవుడ్ రెబల్ స్టార్ తదుపరి చిత్రం రాజాసాబ్ ఈ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్ అయింది, దాంతో పాటు వచ్చే ఏడాది విడుదల కానున్న ఫౌజీ సినిమా గురించి కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఫౌజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, వీడియోలు కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఇక పోస్టర్లు అభిమానులు అనేక రకాల డిజైన్లతో చేసి సోషల్ మీడియాలో వదిలారు.
ఇప్పటికే ఒక ఫోటో లీక్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది, ప్రభాస్ అభిమానులు ఈ ఫోటో చూసి ఇందులో ప్రభాస్ ఏం రోల్ చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోంది ఈ పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ ఫౌజీ సినిమా. తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ కి సంబంధించిన లుక్ లీకైంది.
ఈ లుక్ చూసి ప్రభాస్ అభిమానుల్ వావ్ అదిరింది అంటున్నారు, సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తోంది.
ఇందులో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ లుక్ లో ఉన్నాడు, సన్నివేశానికి సంబంధించి షూటింగ్ లో ఇది ప్రిపేర్ అవుతున్న పిక్, లేదా ఎదుటి వ్యక్తికి డైలాగ్ చెప్పే సమయంలో తీసిన పిక్ అని తెలుస్తోంది. తన ట్రేడ్‌మార్క్ క్లాస్ అప్పీల్‌తో అభిమానులను ఆకర్షిస్తున్నాడు.
ఈ లీక్స్ బెడద అయితే సినిమా యూనిట్లకు ఇబ్బంది కలిగిస్తుంటే, ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ ట్రీట్ అంటున్నారు.
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో సుమారు రూ.600 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తోంది. ఇక బిఫోర్ ఇండిపెండెన్స్ కథ ఇందులో భాగం అని తెలుస్తోంది. స్వాతంత్య్రానికి ముందు కధ కూడా ఇందులో ఉండనుంది అని టాక్.. ఫ్లాష్ బ్యాక్ లో సాయిపల్లవి ఆయనకు జోడిగా కనిపిస్తుంది అని వార్తలు వస్తున్నాయి
మధురై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది, ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి జయప్రద వంటి స్టార్ నటులు భాగమయ్యారు. ప్రభాస్ నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3, 2026న విడుదల కానుంది.