Wednesday, March 18, 2026
HomeNewsCinema50 కోట్లు రెమ్యున‌రేష‌న్ వెన‌క్కి ఇచ్చేసిన ప్ర‌భాస్అందుకే డార్లింగ్ అయ్యాడు

50 కోట్లు రెమ్యున‌రేష‌న్ వెన‌క్కి ఇచ్చేసిన ప్ర‌భాస్అందుకే డార్లింగ్ అయ్యాడు

Published on

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌న దేశంలో స్టార్ హీరో అనే చెప్పాలి, అన్నీ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో జోరుమీద ఉన్నాడు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది, అన్నీ వంద‌ల కోట్ల బ‌డ్జెట్ సినిమాల‌తో అభిమానుల‌ని అల‌రిస్తున్నాడు. అయితే ప్ర‌భాస్ మంచి మ‌న‌సు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌ది మందికీ సాయం చేసే గుణం, త‌న అనుకున్న వారి కోసం ఎంత‌వ‌ర‌కూ అయినా వెళ‌తాడు ప్ర‌భాస్, ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాలుగైదు ప్రాజెక్టుల‌తో బీజీగా ఉన్నాడు.

అయితే ఫ్యాన్స్ కి మాత్రం ప్ర‌భాస్ రానున్న సినిమా రాజాసాబ్ పై ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ సినిమా చేశారు. ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ న‌టిస్తున్నారు. అయితే సినిమా మీద ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆయ‌న డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమా త‌ర్వాత మ‌రో మూడు భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు ప్ర‌భాస్.

Also Read  Rashmika Mandanna: హాట్ & క్యూట్ లుక్స్..

తాజాగా ప్రభాస్ గురించి ఓ తమిళ నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయ‌న త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి తెలియ‌చేశారు. ప్ర‌భాస్ త‌మ‌కు 50 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇచ్చేశాడ‌ని ఆయ‌న అంత మంచి మ‌న‌సున్న వ్య‌క్తి అని తెలిపారు నిర్మాత‌. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా అరుదు అనే విష‌యం కూడా చెప్పారు నిర్మాత‌.

ప్రభాస్ నటించిన సాహో , రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుస గా ఫ్లాప్స్ వ‌చ్చాయి.అయితే త‌న వ‌ల్ల నిర్మాత
న‌ష్ట‌పోకూడ‌దు అని త‌న రెమ్యున‌రేష‌న్ వెన‌క్కి ఇచ్చార‌ట‌.ఈ రోజుల్లో ఇలా ఏ హీరో కూడా ఎవ‌రిని ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ ప్ర‌భాస్ మాత్రం త‌న‌పై న‌మ్మ‌కంతో అంత సినిమా తీసినందుకు త‌న వంతు బాధ్య‌త తీసుకున్నాడ‌ట‌.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌భాస్ అభిమానులు కూడా పెద‌వి విరిచారు. ప్రభాస్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అయితే సినిమా నిరాశపరచడంతో రూ. 50కోట్లు తిరిగి ఇచ్చేశారు అని, నష్టపోయిన డిస్టిబ్యూటర్స్ కు ఇవ్వాలని కోరాడట ప్ర‌భాస్.. ఆనాడు జ‌రిగిన సంఘ‌ట‌న గురించి ఆ నిర్మాత తెలిపారు ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also Read  Telangana ticket price high:తెలంగాణ లో చిరంజీవి మూవీ టికెట్ల ధరల పెంపు..

ప్ర‌భాస్ మంచి మ‌న‌సు గురించి ఆయ‌న అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Latest articles

Tollywood: మరలా టాలీవుడ్‌‌కి తిరిగి వచ్చిన బండ్ల గణేష్..!

టాలీవుడ్‌లో నటుడు మరియు నిర్మాతగా పేరుపొందిన బండ్ల గణేష్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి...

Yellamma Cinema: అఫీషియల్‌ గ్లీంప్స్ ఏప్పుడంటే..?

బలగం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి ఇప్పుడు తన రెండో సినిమా “యెల్లమ్మ” ను...

Chinmayi Sripadaకు షాకింగ్ బెదిరింపులు… న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించిన గాయని

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాడ తీవ్ర సైబర్ వేధింపుల బారిన పడ్డారు. కొందరు గుర్తు తెలియని...

Nagavamshi: వరుస flops తో దిక్కుతోచలేని స్థితిలో…

ప్రొడ్యూసర్ నాగ వంశీ టాలీవుడ్‌లో తెలియని వ్యక్తి కాదు.కానీ ఏమైందో ఏమో — 2025 సంవత్సరం నాగ వంశీకి...

Rashmika The Girlfriend: నాన్-థియేట్రికల్ రైట్స్ కి భారీ డీల్..

రష్మిక మందన్నా తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ఇంకా థియేటర్లలోకి రాకముందే బిజినెస్‌లో భారీ హడావిడి సృష్టిస్తోంది. సినిమా...

“LEO”కు ప్రీక్వెల్‌గా రాఘవ లారెన్స్ హీరోగావస్తున్న “Benz”..!

రాఘవ లారెన్స్ హీరోగా, నివిన్ పౌలి విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం “Benz” సినీ అభిమానుల్లో భారీ అంచనాలను...

More like this

Viswambhara :జులై 10న చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్?

మెగాస్టార్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న భారీ ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు సినీ వర్గాలు...

Shankar Drea Project: నిర్మాత… కానీ కఠిన నిబంధనలతో!

భారతీయ సినీ పరిశ్రమలో విజువల్ గ్రాండియర్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన దర్శకుడు శంకర్ ఎప్పటినుంచో కలగా భావిస్తున్న ప్రాజెక్ట్...

Champion Movie:OTTలోకి వచ్చేసిన ‘ఛాంపియన్’ మూవీ

యువ హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. గత...