PSLV-C62 రాకెట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోట నుంచి ఈ నెల 12న ఉదయం 10.17 గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. అగ్రికల్చర్, అర్బన్ ప్లానింగ్, వాతావరణ పరిశీలన లక్ష్యంగా స్పెషల్‌గా రూపొందించిన EOS-N1 (అన్వేషా) ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు.
దీంతో పాటు ఇతర దేశాల కోసం రూపొందించిన 18 కో-పాసింజర్ పెలోడ్‌లను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టబోతున్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే ఖచ్చితమైన వాతావరణ సూచనలు, పంటల దిగుబడి అంచనాలు, వరదలు–ఎండబార్పుల వంటి సహజ విపత్తులను ముందుగానే గుర్తించే సామర్థ్యం మరింత మెరుగుపడనుంది.
నావిగేషన్, మ్యాపింగ్ సహా పలు రంగాలకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుందని ఇస్రో అధికారులు తెలిపారు. ఇటీవలి ఇచ్చిన బ్లాస్ట్ ఆఫ్ ప్రకటన ప్రకారం ఈ ప్రయోగం విజయవంతం అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.