దేశాన్ని నడిపించే నాయకుడి రక్షణ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు భద్రతా సిబ్బంది. ముఖ్యంగా ప్రధాని రాష్ట్రపతి దేశ అధ్యక్షుడు ఇలా వారి రక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అమెరికా, రష్యా, భారత్, చైనా, జర్మనీ ఇలా ఈ దేశాల అధినేతలు ప్రధానుల రక్షణ విషయంలో ఆయా సెక్యూరిటీ ఎన్నో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తాయి.
అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏం చేసినా సంచలనమే. బయట ఎవరితో ఎక్కువగా ఆయన మాట్లాడరు. తనసెక్యూరిటీకి కూడా జస్ట్ సైగలతో తను ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియచేస్తారు.
అయితే రష్యా అధ్యక్షుడి సెక్యూరిటీ కూడా చాలా పటిష్టమైనది అనే చెప్పాలి. 2025 అలాస్కా శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ముఖాముఖి కలుసుకున్నారు.
అయితే ఉప్పు నిప్పుగా ఉండే ఈ నాయకులు కలుసుకోవడం నుంచి అప్పుడు జరిగిన ప్రతీ అంశం కూడా చర్చగానే సాగింది.
ఆ సమయంలో పుతిన్ భద్రతా వ్యవస్థలోని వారు తీసుకున్న ఒక వింతైన అంశం వెలుగులోకి వచ్చింది. పుతిన్ భద్రతా సిబ్బంది చేతిలో కొన్ని ప్రత్యేక సూట్ కేసులు కనిపించాయి.
అయితే ఇందులో ఆయుధాలు లేదా పత్రాలు ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఒక వార్త వినిపించింది. పుతిన్ ఆరోగ్యం – అనారోగ్య విషయాలు తెలియకుండా, ఆయన మలం సేకరించి ఆ సూట్ కేసుల్లో భద్రపరచి అక్కడ నుంచి తరలించినట్లు తెలిసింది.
తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్ధ ఈ కథనం ప్రచురించింది. అయితే పుతిన్ విదేశాలకు వెళితే కచ్చితంగా ఇదే ఫాలో అవుతారట. దీని వెనుక కారణాలు ఉన్నాయి.
రష్యా వంటి శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ ఆరోగ్య సమస్యల గురించి ఎవరికి ఏమీ తెలియకూడదు అని ఈ రకంగా మలం సేకరిస్తారని ఆ వార్త కథనాంశం.
రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ దగ్గర ఉండి ఆయన సెక్యూరిటీ వ్యవహారాలు చూస్తుంది. విదేశాల నుంచి ఆయన పర్యటన ముగిసి వెళ్లే సమయంలో ఆయన మలం సేకరించి మళ్లీ మాస్కో తీసుకువెళతారట ..విదేశీ నిఘా సంస్థలు పుతిన్ జీవ వ్యర్థాలను విశ్లేషించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం అని తెలుస్తోంది.
ప్రస్తుతం పుతిన్ వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు.