రైల్వే మంత్రిత్వశాఖ ప్రకారం, రైల్వన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసి, డిజిటల్ చెల్లింపులు చేసే ప్రయాణికులకు 3% వరకు రాయితీ లభిస్తుంది. ఈ రాయితీ డైరెక్ట్‌గా టికెట్ ధరపై కాకుండా క్యాష్‌బ్యాక్ రూపంలో క్రెడిట్ అవుతుంది. 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు ఈ పథకం అమల్లో ఉండనుంది.
ఈ ఆఫర్ లక్ష్యం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, టికెట్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీని తగ్గించడం. దీంతో ప్రయాణికులు సమయం ఆదా చేసుకోవడంతో పాటు, చిన్న మొత్తంలోనైనా ఆర్థిక లాభం పొందగలరు. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్ వంటి అన్ని డిజిటల్ పేమెంట్ మార్గాలపై ఈ రాయితీ వర్తిస్తుంది.
అలాగే టికెట్ బుకింగ్ సమయంలో ఆన్–ఆథెంటికేషన్ ప్రక్రియ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. నకిలీ బుకింగ్‌లు, మిడిల్‌మెన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే తెలిపింది. భవిష్యత్తులో ఈ పథకాన్ని శాశ్వతంగా కొనసాగించే అవకాశాన్ని కూడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.