రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కామెడీ టైమింగ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్క్ అవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్ర డిజిటల్ హక్కులను JIO Hotstar సొంతం చేసుకోగా, థియేట్రికల్ రన్ పూర్తయ్యాక OTTలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో థియేటర్‌కు వెళ్లలేని ప్రేక్షకులకు, మరోసారి సినిమా చూడాలనుకునే ఫ్యాన్స్‌కు ఇది మంచి అవకాశంగా మారింది.
తమన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలుస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లో హైలైట్‌గా మారిందని చెబుతున్నారు. మొత్తం మీద ‘రాజాసాబ్’ ప్రభాస్ కెరీర్‌లో ఒక డిఫరెంట్ అటెంప్ట్‌గా నిలుస్తూ, థియేటర్లతో పాటు OTTలో కూడా మంచి స్పందన పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.