గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, RRR విజయం తరువాత, “ఉప్పెన” దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక భారీ పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం అవుతోంది. హిందీ మార్కెట్లో కూడా మంచి క్రేజ్ ఉంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ షెడ్యూల్ మధ్యలో కార్మికుల సమ్మె కారణంగా కొంత విరామం వచ్చినా, ఇప్పుడు మళ్లీ వేగంగా కొనసాగుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.
వినాయకచవితి స్పెషల్ అప్‌డేట్
తాజాగా వినాయకచవితి సందర్భంగా మేకర్స్ ఒక భారీ అప్‌డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ మైసూర్‌లో మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటను కొరియోగ్రాఫ్ చేస్తున్నది ఎవరో కాదు – జానీ మాస్టర్. ఆయన కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
జానీ మాస్టర్ ఎనర్జీ & రామ్ చరణ్ మాస్ స్టెప్పులుఈ పాట కోసం 1000 మంది డ్యాన్సర్లు పని చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ:
“రెహమాన్ గారి డప్పు, రామ్ చరణ్ గారి స్టెప్పు – ఇది మెగా పవర్ స్టార్ బ్లాస్ట్” అని పేర్కొన్నారు. డీఓపీ రత్నవేల్ విజువల్స్ కూడా ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి.
కోట్ల రూపాయల ఖర్చుతో సాంగ్ షూట్
ఈ సాంగ్ కోసం మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు. సెట్ నిర్మాణం కోసం 15 రోజుల పాటు కష్టపడి పని చేశారు. ఈ పాట సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.
జానీ మాస్టర్‌కు తిరిగి లైఫ్ ఇచ్చిన రామ్ చరణ్జానీ మాస్టర్ గతంలో లైంగిక వేధింపుల కేసుతో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఆయన్ని తిరిగి ఆదరిస్తుందా అనే సందేహం అభిమానుల్లో ఉండేది. కానీ రామ్ చరణ్ తన పెద్ది సినిమాలో జానీ మాస్టర్‌కు అవకాశం ఇవ్వడం ఆయన కెరీర్‌లో మళ్లీ సువర్ణావకాశంగా నిలుస్తోంది.
రామ్ చరణ్ ఎప్పటినుంచీ జానీ మాస్టర్‌కు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయన సినిమాల్లో పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు జానీ కొరియోగ్రఫీ చేశారు. అదే నమ్మకంతో ఈ భారీ మాస్ సాంగ్‌ను జానీ మాస్టర్‌కు అప్పగించారు.
సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు
ఈ పాట సినిమా ప్రారంభంలో వస్తుందని సమాచారం.
- సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
- మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది.
- సుకుమార్ రైటింగ్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా 2026 మార్చి 27న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.