గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో మార్క్ సెట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా గురించి మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ చేసేలా చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నారు, రామ్ చరణ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి అవుతోంది.
అయితే ఇటీవల వచ్చిన ఫస్ట్ షాట్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు తల్లి పాత్ర కోసం ఓ నటిని సంప్రదించారట.
ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ స్వాసిక.. ఆమె ఎవరంటే ఇటీవల నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమాలో చుట్ట కాలుస్తూ విలన్ రోల్ లో నటించిన ఆమె.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే స్వాసిక రామ్ చరణ్ కంటే వయసులో చాలా చిన్నది, ఆమెని తల్లి క్యారెక్టర్ కి అడగడం ఏమిటి అని అందరూ షాక్ అవుతున్నారు.
తాజాగా ఆమె ఈ విషయం పై మాట్లాడుతూ తల్లి క్యారెక్టర్ కోసం సంప్రదించారు. కానీ నేను నో చెప్పాను అన్నారు.
రామ్ చరణ్ కు నేను తల్లిపాత్ర చేయకపోవడం బెటర్ అనుకున్నాను. ఒకవేళ భవిష్యత్ లో రామ్ చరణ్ కు తల్లి పాత్ర చేయాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తానని స్వాసిక తెలిపింది.అయితే ఈ వార్త విని అందరూ షాక్ అవుతున్నారు
రామ్ చరణ్ వయసు 40 ఏళ్లు, స్వాసిక వయసు 33 ఏళ్లు. బుచ్చిబాబు ఎంత మేకోవర్ తో ఆమెని తయారు చేసినా
ఎంతో గొప్పగా ఆమె నటించినా ఏజ్ గ్యాప్ తెలిసిపోతుంది… తల్లి రోల్ అంటే కీలక పాత్ర అవుతుంది, ఇలా చేస్తే ఆ పాత్రలో ఉండే సోల్ దూరం అవుతుంది అంటున్నారు.. ఇక ఆమె నో చెప్పడంతో తాజాగా ఈ పాత్ర కోసం నటి ఆమనిని సంప్రదించారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.