మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆనందంలో మునిగిపోయింది! టాలీవుడ్ పవర్ కపుల్ రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని కొనిదెల త్వరలో ట్విన్స్ (జంట పిల్లలు)ను ఆహ్వానించబోతున్నారు. దీపావళి సందర్భంగా ఈ సంతోషవార్తను అభిమానులతో పంచుకున్నరు.
ఈ జంటకు అభిమానులు, సినీ స్నేహితులు శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా “ఈ దీపావళి మా కోసం డబుల్ ఆనందం, డబుల్ ప్రేమ, డబుల్ ఆశీర్వాదాలు తీసుకువచ్చింది” అంటూ బేబీ షవర్ వేడుక ఫోటోలను పంచుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా, ఆత్మీయంగా జరిపారు. వేదికను పూలతో, దీపాలతో సుందరంగా అలంకరించి, పాజిటివ్ వైబ్స్ నింపారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై, దంపతులకు ఆశీర్వాదాలు అందించారు.
2023 జూన్‌లో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ మొదటి పాప క్లిన్ కారా కొనిదెలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తల్లిదండ్రులుగా మారడానికి సిద్ధమవుతున్న వీరు ఈసారి డబుల్ హ్యాపీనెస్లో ఉన్నారు. ఎప్పటిలాగే ఈ దంపతులు హంగు ఆర్భాటాలకంటే భావపూర్వకమైన వేడుకలు, కుటుంబ బంధాలుకే ప్రాధాన్యత ఇస్తారు.
ఈ బేబీ షవర్ వేడుక కూడా అదే విధంగా సాదాసీదా అందంతో, ఆప్యాయతతో నిండిపోయింది. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో “మెగా బేబీస్ కమింగ్”, “డబుల్ జాయ్ ఇన్ మెగా హౌస్”, “క్లిన్ కారా కి ఇద్దరు సిబ్లింగ్స్ రాబోతున్నారు!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.