దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు చెప్పాలంటే, మెజార్టీ నేతలు ఏదో ఒక వ్యాపారం లేదా మరో ప్రముఖ రంగంలో కొనసాగుతున్నారు. దీంతో ప్రజా సేవతో పాటు ఆ రంగాల్లో రాణిస్తున్నారు. మంచి ఆదాయాలు సంపాదిస్తున్నారు.
అయితే ఎన్నికల సమయంలో ఈ నాయకులు పోటీ చేయడంతో కచ్చితంగా నామినేషన్ సమయంలో అఫిడవిట్లు సమర్పిస్తారు, దీని వల్ల ఏ నాయకుడు ధనవంతుడు అనేది తెలుస్తుంది.
అయితే తాజాగా మన దేశంలో ఏ ముఖ్యమంత్రి అత్యంత ధనవంతుడు, ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు, ఇక పేద సీఎంగా ఎవరు ఉన్నారు అనే జాబితా విడుదల చేసింది ఏడీఆర్.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా ఈ జాబితా విడుదల చేశాయి.
ఇందులో మరి ఎవరు ఏ స్ధానంలో ఉన్నారు అనేది చూద్దాం.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అందరు నాయకుల కంటే ఫస్ట్ ప్లేస్ లో రిచెస్ట్ సీఎంగా ఉన్నారు.
దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు తొలి స్దానంలో నిలిచారు. ఆయన తర్వాత రెండోస్ధానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేవలం రూ. 15.38 లక్షల ఆస్తులతో అందరికంటే లాస్ట్ లో నిలిచారు. దేశంలో పేద సీఎం ఆమె అని చెప్పాలి.
చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ సతీమణి భువనేశ్వరి ఆస్తులతో కలిపి రూ. 931 కోట్లు ఆయన తొలి స్దానంలో ఉన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ. 332 కోట్లు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ. 51 కోట్ల ఆస్తులతో ధర్డ్ ప్లేస్ లో ఉన్నారు.
30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7 స్థానంలో ఉన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్ 1.18 కోట్లు ఆస్తులతో నిలిచారు
ఒమర్ అబ్దుల్లా 55 లక్షలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులు కలిగి ఉన్నారు
వారు సమర్పించిన అఫిడవిట్, వారి ఆదాయపన్ను బట్టి ఈ జాబితా రూపొందిస్తారు.