ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి తాజాగా ఆర్‌కే సాగర్, మిషా నారంగ్ జోడీగా నటించిన ది 100 సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమా జూలై 11న దియేటర్ రిలీజ్ జరిగింది.
అయితే యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌తో పాటు లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో ధన్యాబాలకృష్ణ నటించింది..పోలీస్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ మూవీని రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపు నిర్మించారు. ఈ చిత్రం తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఆర్కే సాగర్ మెయిన్ రోల్ లో ఐపీఎస్ గా అలరించారు.. కాప్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం ఓ ధ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ఆర్కే సాగర్, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, లక్ష్మీ గోపాల స్వామి, బాలకృష్ణ, జయంత్, విష్ణు ప్రియ, టెంపర్ వంశీ, కీలక రోల్స్ లో నటించారు .. సీరియల్స్ ద్వారా ప్రతీ ఇంటికి దగ్గర అయిన నటుడు ఆర్కే సాగర్, బుల్లితెరలో ఆయన్ని అందరూ ఆర్కే నాయుడుగా దగ్గర చేసుకున్నారు. సాగర్ చాలా కాలం తర్వాత ది 100 సినిమాతో అలరించారు.. ధియేటర్ పూర్తి రన్ ముగించుకుని ఓటీటీలో ఈ సినిమా సందడి చేస్తోంది, మరి ఎలా అలరించిందో చూద్దాం.
కథ
సిటిలో ఓ ముఠా ప్రజలని హడలెత్తిస్తుంది. వరుస హత్యలు దోపిడీలకు పాల్పడుతుంది, అప్పుడే సివిల్స్ కి ఎంపికై ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుని ఉద్యోగంలో చేరతాడు విక్రాంత్ ఆర్కే సాగర్.. ఈ కేసులు అన్నీ విచారణ చేస్తాడు.
ఒడిశాకి చెందిన ఓ ముఠా దీని వెనుక ఉన్నట్టు పసిగడతాడు. అయితే విక్రాంత్ ఇష్టపడిన ఆర్తి కూడా ఈ ముఠా చేతిలో బాధితురాలు..ఇవన్నీ కూడా కేస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటాడు విక్రాంత్. అయితే ఈ కేసు విచారణ చేసేకొద్ది కొన్ని సంచలన విషయాలు బయటపడతాయి.
దీంతో అసలు ఈ దోపిడీలు హత్యలు చేస్తున్న ముఠా ఎవరు? చివరకు వారికి న్యాయం జరిగిందా? విక్రాంత్ తొలి పోస్టింగ్ లో సక్సస్ అయ్యాడా, ఇవన్నీ కచ్చితంగా ది 100 సినిమాలో చూడాల్సిందే.
ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ సినిమాలు చూసే వారికి ఈ స్టోరీ బాగా నచ్చుతుంది . ఈ సినిమా ఓటీటీలో మంచి క్రేజ్ పొందుతుంది అనే చెప్పాలి. ధియేటర్లలో యావరేజ్ టాక్ సంపాదించున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం మంచి వాచ్ అవర్స్ సంపాదించింది.
ఇక మలుపులతో ఆసక్తి ని పేంచే స్టోరీ ఇది…కొత్తగా చెప్పాల్సిన పాయింట్ ఏమిటి అంటే? ఐపీసీలోని సెక్షన్ 100ని ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మలచడంలో దర్శకుడు తన వంతు ప్రయత్నం చేశారు అంతేకాదు సక్సస్ అయ్యారు.. ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తి పెంచేశారు దర్శకుడు.
కేసు పరిశోధన అంతా సెకండాఫ్ తో చాలా ఆసక్తిగా దర్శకుడు మలిచారు
ఐపీఎస్ పాత్రలో ఆర్కే నాయుడు చాలా బాగా నటించారు. బుల్లితెరలో అలవాటైన పోలీస్ పాత్రలో ఒదిగిపోయారు ఆయన. మంచి కథలు వస్తే సాగర్ కచ్చితంగా పెద్ద సినిమాల్లో కూడా నటించవచ్చు.
ఈ సినిమాలో ఆర్కే సాగర్ యాక్షన్ సన్నివేశాలతోనూ ఆకట్టుకున్నాడు
హీరోయిన్ మిషా నారంగ్ స్కోప్ ఉన్న పాత్ర చేసింది
ధన్య బాలకృష్ణ, విష్ణు ప్రియ కూడా వారి పరిది మేరకు ఆకట్టుకున్నారు.
ది 100 సినిమా అమెజాన్ లో పాజిటీవ్ టాక్ తో వాచ్ అవర్స్ పెరుగుతోంది.