
ఇక పై పెళ్లి కాని జంటలకు రూమ్స్ బుకింగ్స్ లేదంటూ తేల్చిచెప్పిన ఓయో.
ఈమేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
ఇకపై పెళ్లి కాని యువతీ, యువకులు ఓయో రూమ్స్ లో చెక్ ఇన్ చేసేటప్పుడు వారి రిలేషన్షిప్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్స్ అడగనుంది.
సరైన ఐడి ప్రూఫ్ లేకపోతే బుకింగ్స్‌ను తిరస్కరించే అధికారాన్ని పార్టనర్ హోటల్స్‌కు ఇస్తున్నట్టు ఓయో చెప్పుకొచ్చింది.
మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది.
అక్కడ నుంచి వచ్చే గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా కంపెనీ ఈ కొత్త రూల్‌ని మరిన్ని నగరాలలో అమలు చేయనుంది.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.