
సికిందరబద్ లో ఒకప్పుడు ఎంతో పేరుగాంచిన సీటీసీ మార్కెట్ ఇప్పుడు మోసాలుకు మరియు స్కామ్ లకు నిలయంగా మారిందని వీనియాగదారులు చెపుతున్నారు.
రెడ్డిట్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా ఒక వినియోగ దారుడు తన భాదను మరియు అనుభవాన్ని వివరించాడు. ల్యాప్‌టాప్‌ను చెక్ చేయడానికి అనుమతి లేకుండానే తన దగ్గర రూ. 600 ఛార్జ్ చేశారని ఆయన తెలిపారు. ఈ రెడ్డిట్ లో ఇలాంటి చాలా సంఘటనలను చాలా మంది చెప్పారు.
ముఖ్యంగా ARN కంప్యూటర్స్‌లో జరిగిన ఒక సంఘటనలో ఒక కస్టమర్ ఇలా చెప్పారు “మదర్‌బోర్డు కోసం ముందుగా రూ. 2,500 చెల్లించగా , చివరకు అది పాడైపోయిందని చెప్పి అదనంగా మరో రూ. 7,000 వసూలు ఛేశారు.
2000 year ప్రారంభంలో టెక్నాలజీకి స్వర్గధామంగా విలసిల్లిన హైదరాబాద్‌లోని చెనాయ్ ట్రేడ్ సెంటర్ (CTC) ఇప్పుడు వినియోగదారుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
ఇటీవల వస్తున్న complaints తో ఇప్పుడు ఈ ప్రదేశాన్ని “స్కామ్ సెంటర్ ” గా పిలుస్తున్నారు.
చాలా మంది వినియోగదారులు వాళ్ళ అభిప్రాయన్ని ఇలా చెపుతున్నారు.
ఒకరు తమ కొత్తగా కొన్న కంప్యూటర్‌లో “రిఫర్బిష్డ్” (మరమ్మతులు చేసిన) భాగాలు ఉన్నాయని చెప్పారు; మరొకరు పదేళ్ల నాటి హార్డ్ డ్రైవ్‌ను కొత్త ప్యాకింగ్‌లో అమ్మారని ఆరోపించారు.
అయితే, అత్యంత భయానకమైన సంఘటన ఏమిటంటే, పార్కింగ్ ఛార్జీల విషయంలో గొడవ జరగడం వల్ల ఒక పార్కింగ్ అటెండెంట్ కారు టైర్‌ను కోసేయడం – రూ. 20 ఉన్న ఛార్జీ ఎలాంటి వివరణ లేదా రసీదు లేకుండా అకస్మాత్తుగా రూ. 120 చేయడం.
మోసాలే కాకుండా, ఇక్కడి సౌకర్యాలు కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అని మరియు ఇరుకైన కారిడార్లు, ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్న shopes .శిథిలావస్థలో ఉన్న దుకాణాల బయటి భాగాలు ఇవన్నీ కలిసి ఇక్కడ గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయి.
“పార్కింగ్ మాఫియా” గురుంచి ఎంత చెప్పిన ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ “భవిష్యత్తు నగరం”గా ముందుకు సాగుతు ఉన్నప్పటికీ, CTC మాత్రం అత్యాశ, మోసాలు మరియు బాధ్యత లేకపోవడంతో చాలా అద్వానంగా మారిందని ప్రజలు అంటున్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతున్నందున, సీటీసీకి లో మార్పులు మరియు చెరుపులు చేయకపోతే ఇది కనుమరుగయ్యే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు.