మనలో చాలా మంది నిత్యం బ్యాంకులకి పనిమీద వెళుతూ ఉంటారు, ముఖ్యంగా వ్యాపారం చేసేవారు అయితే కచ్చితంగా రోజు బ్యాంకుకి వెళ్లకపోతే వారి పని జరగదు. డీడీలు చెక్ లు ఈ ప్రాసెస్ కోసం కచ్చితంగా బ్యాంకుకి వెళ్లాల్సిందే. నగదు లావాదేవీలు అన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి అనే విషయం తెలిసిందే.
అయితే ప్రతీ ఏటా కొత్త సంవత్సరానికి ముందే హాలిడే లిస్ట్ సిద్ధం అవుతుంది ఆర్బీఐ దీనిని సిద్దం చేస్తుంది, సో వచ్చే నెల సెప్టెంబర్ కి సంబంధించి హాలీడే లిస్ట్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ నెలలో 14 రోజులు బ్యాంకులకి సెలవులు ఉన్నాయి..వీటిలో ఎక్కువగా ప్రాంతీయ సెలవులే ఉన్నాయి. నేషనల్ హాలిడేస్ తక్కువగా ఉన్నాయి.
ఆయా రాష్ట్రాలో స్దానిక పండుగల ఆధారంగా ప్రత్యేక రోజుల ఆధారంగాసెలవులు ఇస్తారు.
మరి వచ్చే నెలలో ఏఏ రోజులు బ్యాంకులకి సెలవు అనేది చూద్దాం.
సెప్టెంబర్ నెలలో పండుగలు, వారాంతాలతో కలిపి మొత్తం 14 రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. తాజాగా ఆర్బీఐ దీనికి సంబంధించి సెలవుల క్యాలెండర్ లో తెలియచేసింది.. బ్యాంకు కస్టమర్లు దీనిని గుర్తించాలి.
సెప్టెంబర్ లో 9 రోజులు పండుగ సెలవులు ప్రత్యేక రోజుల సెలవులు ఉన్నాయి.
ఈ 9 రోజులకి అదనంగా ఐదు వారాంతపు సెలవులు ఉన్నాయి.
ఏపీ తెలంగాణలో సెలవులు
సెప్టెంబర్ 5న (శుక్రవారం) మిలాద్-ఉన్-నబీ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 3, బుధవారం: కర్మ పూజ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలో బ్యాంకులకి సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 6, శనివారం మిలాద్ యున్ నబీ ఇంద్రజాతర ఈ రెండు పండుగలకి సిక్కిం ఛత్తీస్ ఘడ్ లో సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 12, శుక్రవారం: ఈద్ ఇ మిలాద్ యుల్ నబీ తర్వాత వచ్చే శుక్రవారం కాబట్టి సెప్టెంబర్ 12న జమ్ము, శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్ 22, సోమవారం: నవరత్న స్థాపన రాజస్దాన్ స్టేట్ లో హాలీడే ఉంటుంది
సెప్టెంబర్ 23, శనివారం మహరాజ్ హరి సింగ్ జీ జయంతి సందర్బంగా శ్రీనగర్ లో సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 29, సోమవారం మహా సప్తమి, దుర్గా పూజ అస్సాం వెస్ట్ బెంగాల్ లో సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు.
సెప్టెంబర్ 13 రెండో శనివారం
సెప్టెంబర్ 27 నాలుగో శనివారం ఇలా మొత్తం బ్యాంకులకి వచ్చే నెలలో 14 రోజులు సెలవులు ఉంటాయి
సెప్టెంబర్ 30, మంగళవారం: మహా అష్టమి, దుర్గాష్టమి, త్రిపుర , ఒడిశా, అస్సాం, మణిపూర్, బ్యాంకులు సెలవు
బ్యాంకులు క్లోజ్ చేసి ఉన్నా మీకు ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం సేవలు, యూపీఐ లావాదేవీలు జరుగుతాయి. మీకు చెక్ క్లియరెన్స్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు ( కొందరు కస్టమర్లకు)
లోన్ ప్రాసెస్, ఇవన్నీ జరగాలి అంటే బ్యాంకు పనిచేయాల్సిందే
ఇలాంటి సర్వీసులకి బ్యాంకులు కార్యకలాపాలు జరిపిన రోజు మాత్రమే అవకాశం ఉంటుంది.
మీరు ఈ సెలవు రోజుల్లో బ్యాంకు పని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి.
వీటిలో ఎక్కువగా ప్రాంతీయ సెలవులే ఉన్నాయి. నేషనల్ హాలిడేస్ తక్కువగా ఉన్నాయి.
బ్యాంకు ఉద్యోగులు వారంలో ఐదు రోజులే పనిదినాలు కల్పించాలని ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు కానీ కేంద్రం మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు.