భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ఎంత ప్రత్యేకస్ధానం ఉందో తెలిసిందే.. ఆలయాలలో కూడా వెండి ఆభరణాలు వస్తువులు ఎక్కువగా ఉపయోగిస్తారు. దేవతారాధన కోసం మనం వెండి వస్తువులు వాడతాం.
మన దేశంలో ప్రతీ ఇంట్లో వెండి వస్తువులు ఉంటాయి, శుభకార్యాలు వివాహాలు జరిగితే బంగారం ఎలా కొంటామో వెండి అలాగే కొనడం జరుగుతుంది. బంగారానికి హాల్ మార్కింగ్ ఉన్నట్లే వెండికి కూడా హాల్ మార్కింగ్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే కస్టమర్లు చాలా చోట్ల ఈ మోసాలతో తమ డబ్బు పొగొట్టుకున్నారు.. పైకి మెరిసేది అంతా బంగారం వెండి కాదు అని సామెత ఉన్నట్లే, మోసాలు కూడా ఇలాగే చాలా చోట్ల జరిగాయి.
ప్రభుత్వం కూడా దీనిపై పలు ధఫాలుగా ఆలోచన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ఇక పై వెండి ఆభరణాలకి కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. దేశంలో ఇది కొత్త నిర్ణయం అనే చెప్పాలి. ఇప్పటి వరకూ బంగారు ఆభరణాలకి హల్ మార్కింగ్ ఉంది ఇకపై వెండి వస్తువులకి కూడా ఈ రూల్ వర్తిస్తుంది.
బంగారం మాదిరిగానే వెండిపై కూడా కఠిన నియమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 1, 2025 నుంచి వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్ ఉండాల్సిందే.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, 900, 800, 835, 925, 970, 990 ఈ ఆరు వర్గాలుగా వెండి ఆభరణాలు వర్గీకరణ చేస్తారు.. అంటే సిల్వర్ ప్యూరిటీ దీనిని తెలియచేస్తుంది.. ఆ వెండి ఆభరణం ప్యూరిటీ తెలిపేలా, ప్రతి ఆభరణంపై స్వచ్ఛత ఆధారంగా 6 అంకెల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ముద్రిస్తారు.
ఇక కస్టమర్లు ఈజీగా ఈ వెండి వస్తువులని చెక్ చేసుకోవచ్చు. దీనికోసం బీఐఎస్ కేర్ యాప్‌లోని వెరిఫై HUID ఫీచర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ వెండి ఆభరణం మీద 925 అనే నెంబర్ ఉంటే అది 92.5 శాతం సిల్వర్ ప్యూరిటీ అని అర్దం. మిలిగిన 7.5 శాతం ఇతర లోహాలు అందులో కలిపారు అని అర్దం వస్తుంది.
999 ముద్ర ఉంటే అది 99.9 శాతం స్వచ్ఛమైన వెండి అని అర్దం.
నిజమైన వెండి ఆభరణాలపై దాని స్వచ్ఛతను తెలిపే ముద్ర ఉంటుంది.. అయితే ఇప్పటికే కొన్ని షాపులు పెద్ద పెద్ద సంస్ధలు వాటి ప్యూరిటీని తెలిపే ట్యాగ్స్ ముద్రిస్తున్నాయి, ఇక పై అన్నీ షాపులు వ్యాపారులు దానిని పాటించాల్సిందే. ఈ హల్ మార్కింగ్ మార్కులు బంగారానికి కొన్ని వస్తువులకి ఉంగరం లోపల, గొలుసు కొక్కెం దగ్గర లేదా పెండెంట్ వెనుక భాగంలో ఉంటాయి. ఇక పై వెండి వస్తువులపై కూడా ఇవి ఉంటాయి గమనించండి.
దాదాపు ఒక 30 లేదా 40 ఏళ్ల క్రితం ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు.. దీంతో కొందరు తయారీదారుల నకిలీ బంగారం అమ్మేవారు.. నకిలీ బంగారం అంటే కాపర్ ను ఎక్కువగా ఈ ఆభరణాల్లో వినియోగించేవారు
దీని వల్ల కస్టమర్లు చాలా నష్టపోయేవారు.. దీంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన పసిడిని గుర్తించేందుకు వీలుగా ఈ హాల్‌మార్క్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు సిల్వర్ వస్తువులకి కూడా దీనిని పాటించాలి అనే రూల్ తీసుకువచ్చింది, ఇది నిజంగా కస్టమర్లకు చాలా ప్రయోజనకరం. దానిమీద ఉన్న హల్ మార్క్ ద్వారా వాటి ప్యూరిటీ క్వాలిటీ ఈజీగా తెలుస్తుంది. దానిని ఒకవేళ అమ్మినా మరో కొత్త వస్తువు తీసుకున్నా ఆ ధర కచ్చితంగా చెల్లిస్తారు.