ఈ రోజుల్లో బయట ఏదైనా ఫుడ్ తినాలి అంటే భయమేస్తుంది. బజ్జీలు మిక్చర్లు, చికెన్ పకోడీలు, జ్యూస్ లు, బిర్యానీలు, ఇలా ఏది తీసుకున్నా బయట తినాలంటే గజగజ వణికిపోతున్నారు జనం. ఎందుకంటే హైజీన్ పక్కన పెడితే అందులో బయటపడుతున్న పదార్దాలు ముందు ఆందోళన కలిగిస్తున్నాయి. బిర్యానీల్లో పురుగులు, జెర్రీ, బొద్దింకలు, బల్లులు ఇలా ఎన్నో చూశాం.
అయితే జ్యూస్ లో కూడా వానపాము రావడం ఇటీవల చూశాం. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కర్రీపఫ్ తినేందుకు బెకరీకి వెళ్లిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది.
ఎంతో ఆకలిగా ఉండి ఆ బేకరీలో కర్రీ పఫ్ ఆర్డర్ ఇచ్చి తీసుకుంది. ఆకలిగా ఉండటంతో ఒక ముక్క తీసేసరికి టేస్ట్ మార్పు గమనించింది. ఏమి ఉందా అని చూసేసరికి అందులో పాము పిల్ల చనిపోయి కనిపించింది.
ఆ మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వెంటనే బేకరీ వారికి ఈ విషయం చెప్పింది. అంతేకాదు పోలీసులకి కూడా సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు కూడా జడ్చర్ల లో బేకరీకి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే పఫ్ లు కేక్ ఐటెమ్స్ అన్నీ చెక్ చేయించారు. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ అధికారులకి సమాచారం ఇచ్చారు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు.
ఒకవేళ ఇలాంటి పరిస్దితి ఎప్పుడైనా ఎదురైతే.. అక్కడ రెస్టారెంట్లు, బేకరీల యజమానులు సరైన సమాధానం చెప్పకపోతే, నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా మున్సిపల్ అధికారులకి సమాచారం చేరవేయవచ్చు, వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఈ విషయం తెలియచేస్తారు. ఒకవేళ రూరల్ అర్బన్ పంచాయతీల దగ్గర షాపుల్లో రెస్టారెంట్లలో జరిగినా స్ధానికంగా ఉన్న పంచాయతీ అధికారులకి ఈ విషయం తెలియచేస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకి సమాచారం అందచేస్తారు. అయితే ఆ పఫ్ లు ఎప్పుడు తయారు చేశారు ఆ పరిసరాలు ఏమిటి అనేది కూడా విచారణ చేస్తున్నారు అధికారులు.
ఎంత దారుణం ఏదైనా తినే సమయంలో కచ్చితంగా వాటిని ముక్కలుగా చేసి తినడం అనేది మేలు ఈ రోజుల్లో.