
పునర్వినియోగ శక్తి రంగంలో కొత్త యుగానికి నాంది పలికే అవకాశం ఉన్న ఈ ఆవిష్కరణను StanFord University పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఈ కొత్త సాంకేతికత వల్ల సోలార్ ప్యానెల్స్ రాత్రిపూట, చంద్రకాంతిలో, వర్షపడుతున్నా లేదా మేఘావృతమైన వాతావరణంలో కూడా విద్యుత్ ఉత్పత్తి చేయగలవు.
అవును, సోలార్ ప్యానెల్స్ రాత్రిపూట విద్యుత్ ఉత్పత్తి చేయలేవన్న దీర్ఘకాల సమస్యకు StanFord University పరిశోధకులు పరిష్కారం చూపారు.
వారు “రేడియేటివ్ కూలింగ్” అనే ప్రక్రియ ద్వారా రాత్రి ఆకాశాన్ని శక్తి వనరులుగా మార్చే మార్గాన్ని కనిపెట్టారు.
ప్రొఫెసర్ Shanhui Fan అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీకి ప్రజల్లో “MoonLight Pannels” అనే పేరు పెట్టారు.
ఇందులో “రేడియేటివ్ కూలింగ్” అనే ప్రక్రియ ఉపయోగిస్తారు, దీంట్లో గాలి వైపు వేడి వెళ్తుంది.
స్పష్టమైన ఆకాశం ఉన్న రాత్రుల్లో భూమి నుండి అంతరిక్షానికి ఇన్‌ఫ్రారెడ్ శక్తి విడుదల అవుతుంది. ఈ వేడి తేడాతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
ఇది ఇప్పుడప్పుడే అభివృద్ధి దశలో ఉన్నా, ప్రత్యేకించి విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల కోసం దీన్ని ఉపయోగించాలని , పునర్వినియోగ శక్తిగా తీర్చిదిద్దవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.
రాత్రిపూట సోలార్ ప్యానెల్స్ ఎలా విద్యుత్ ఉత్పత్తి చేస్తాయ్?
ప్రొఫెసర్ షాన్హుయ్ మరియు అతని బృందం, కాస్త మార్చిన కమర్షియల్ సోలార్ ప్యానెల్స్‌కు థర్మోఎలక్ట్రిక్ జనరేటర్లను జతచేసి, విడుదలవుతున్న వేడి నుండి విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ మార్పులతో కూడిన సోలార్ ప్యానెల్స్ ఒక్కో చదరపు మీటర్‌కు రాత్రిపూట 50 మిల్లీవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి.
సాధారణంగా రోజుశాతం సోలార్ ప్యానెల్స్ 200 వాట్స్/మీ² ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇది తక్కువే అయినా, LED లైట్లూ, పర్యావరణ సెన్సార్లు వంటి చిన్న పరికరాలకు సరిపోతుంది. “ఇది తక్కువ శక్తి ఉత్పత్తి అయినా, మెరుగుదలకూ బాగా అవకాశం ఉంది,” అని ప్రొఫెసర్ ఫాన్ స్టాన్ఫర్డ్ వెబ్‌సైట్‌లో తెలిపారు.
రాత్రిపూట విద్యుత్ గ్యాప్‌ను భర్తీ చేసే చంద్రకాంతి సోలార్ టెక్నాలజీ
“ఈ చంద్రకాంతి ప్యానెల్ టెక్నాలజీని ఇప్పటికే ఉన్న సోలార్ ప్యానెల్స్‌తో సులభంగా కలిపేసుకోవచ్చు. అందువల్ల ఇది పునర్వినియోగ శక్తి విశ్వసనీయతను మెరుగుపరచడానికి తక్కువ ఖర్చుతో కూడిన, సరైన దశ” అని పరిశోధకులు పేర్కొన్నారు.
బ్యాటరీలపై ఆధారపడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాటరీలు ఖరీదైనవే కాక, ఖనిజాల తవ్వకాల వల్ల పర్యావరణానికి హానికరం కూడా. చిన్న పరికరాలకు నేరుగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల బ్యాటరీల తయారీ, తొలగింపు వల్ల కలిగే పర్యావరణ నష్టం తగ్గవచ్చు.
చంద్రకాంతి సోలార్ ప్యానెల్స్ రాత్రిపూట లేదా నీడ ఉన్న సమయంలో విద్యుత్ గ్యాప్‌ను పూడ్చగలవు. దీంతో కిరణజనిత శక్తిని తక్కువ సూర్యకాంతి ఉన్న ప్రాంతాల్లో కూడా మరింతగా ఉపయోగించుకోవచ్చు అని పరిశోధకులు తెలిపారు.
Discover more from TeluguPost TV
Subscribe to get the latest posts sent to your email.