రజినీకాంత్ కూలీ సినిమా ఇటీవల రిలీజయింది.. సూపర్ పాజిటీవ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ కీలక రోల్స్ లో నటించారు.
అయితే ఇంత మంది స్టార్లు ఉన్నా, ఒక నటుడి గురించి మాత్రం ప్రతీ ఒక్క సినిమా అభిమాని మాట్లాడుకుంటున్నారు. అతనే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.
కూలీ సినిమా నుంచి పూజ హెగ్డే మోనికా సాంగ్ వచ్చినప్పుడే, అందులో పూజాకు పోటీగా డ్యాన్స్ చేసి వైరల్ అయ్యాడు సౌబిన్ షాహిర్.
తన డ్యాన్స్ మూమెంట్ తో మరింత పేరు పొందాడు పాన్ ఇండియా స్ధాయిలో. మరి ఈనటుడు ఎవరు, ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కేరళలో ఫోర్ట్ కొచ్చిలో జన్మించారు సౌబిన్ షాహిర్ . ఈయనకు ఒక సోదరుడు, సోదరి కూడా ఉన్నారు.
మణిచిత్రతళు, గాడ్ ఫాదర్,
ఇలాంటి చిత్రాలలో పనిచేసిన మాజీ యాడ్ ప్రొడక్షన్ కంట్రోలర్ బాబు షాహిర్ కుమారుడు సౌబిన్.. వీరి కుటుంబానికి ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ ఉంది.
సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో సౌబిన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు..ఈ లోగా దొరికిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు.
2000 సంవత్సరంలో ఫాజిల్, సిద్ధిక్, సుకుమార్, సంతోష్ శివన్, వీరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు . వెండి తెరపై మాత్రం మమ్ముట్టి నటించిన క్రానిక్ బ్యాచిలర్ ఈ సినిమాతో తొలిసారి కనిపించాడు.
తర్వాత ప్రేమమ్ సినిమాలో పిటి టీచర్ పాత్రను పోషించాడు. తర్వాత మరిన్ని అవకాశాలు వచ్చాయి. సొంత ప్రాంతం మలయాళంలోనే కాదు తర్వాత తమిళ్ లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి.
పరవ అనే సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు సౌబిన్.. ఇది పలు సెంటర్లలో 100 డేస్ ఆడింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది ఈ స్టోరీ.
కొన్నాళ్ల క్రితం వచ్చిన మంజుమల్ బాయ్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు, అంతేకాదు ఈ సినిమానిర్మాత కూడా అతనే.
ఈ సినిమా 10 కోట్ల పెట్టుబడి పెడితే ఏకంగా 250 కోట్ల వసూల్లు తెచ్చింది. సుడానీ ఫ్రమ్ నైజీరియా సినిమాకి కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చింది.
ఇక దర్శకుడు లోకేష్ కనగరాజ్ పిలిచి కూలి సినిమాలో ఈ అవకాశం ఇచ్చారు. తన టాలెంట్ ని ఈ సినిమాలో చూపించి మరింత పేరు పొందాడు.
సౌబిన్ షాహిర్ 2017 డిసెంబర్ 16న జామియా జహీర్ ను వివాహం చేసుకున్నారు. కొచ్చికి చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్ గా ఆమె పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.