తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు యావత్ దేశ చలనచిత్ర పరిశ్రమలో బాహుబలి ఓట్రెండ్ సెట్టర్. కంటెంట్ పై నమ్మకం ఉంటే ఎన్ని కోట్లు అయినా పెట్టుబడి పెట్టవచ్చు అని నిర్మాతలకు దైర్యం నింపిన సినిమా ఇది.. మొత్తానికి దర్శకుడి ప్రతిభ కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిందే. అయితే ముందు ఈ సినిమాలో రోల్స్ గురించి మాట్లాడుకుంటే బాహుబలి మూవీలో శివగామి రోల్ మరో హైలెట్ అనే చెప్పాలి. ప్రభాస్ అలాగే కట్టప్ప పాత్ర తర్వాత శివగామి రోల్ అదిరిపోయింది. అయితే ముందు ఈ రోల్ కోసం టాలీవుడ్ అందాల భామ శ్రీదేవిని సంప్రదించారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ రోల్ శ్రీదేవి రిజెక్ట్ చేశారు అని టాక్ నడిచింది. కాదు నిర్మాతలే వద్దు అనుకున్నారు అనేలా మరో టాక్ నడిచింది.. అసలు వాస్తవం ఏమిటి అనేది తాజాగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.
శ్రీదేవి భారీ డిమాండ్లు చేశారంటూ వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారాయన. రాజమౌళి వచ్చి సినిమా మొత్తం నేరేట్ చేశారు, శ్రీదేవికి కూడా కథ నచ్చింది అయితే శ్రీదేవిగారికి రాజమౌళి కూడా ఫ్యాన్ అని తెలిపారు.
బాహుబలి నిర్మాతలు తక్కువ పారితోషికం ఇస్తామని చెప్పినట్లు బోనీ కపూర్ తెలిపారు. అయితే అస్సలు రెమ్యునరేషన్ గురించి మాట్లడిన సమయంలో దర్శకుడు రాజమౌళి అక్కడ లేరు అనే విషయం చెప్పారు. కేవలం నిర్మాతలు మాత్రమే ఉన్నారు అనే విషయం తెలిపారు బోనీకపూర్.
అయితే శ్రీదేవి చాలా డిమాండ్లు పెట్టారు అని వార్తలు వినిపించాయి. ఒక ఫ్లోర్ మొత్తం కావాలని, లగ్జరీ హోటల్ రూమ్స్ , పలువురు సిబ్బంది ఇవన్నీ ఆమె కండిషన్లు పెట్టారు అని వార్తలు వచ్చాయి. అస్సలు ఇవన్నీ నిజం కాదు ఇందులో ఒక్క మాట కూడా శ్రీదేవి అడగలేదు అని తెలిపారు బోనీ కపూర్.
ఇద్దరు పిల్లల స్కూల్ చదువుకుంటున్నారు, సెలవులకు అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేయమని చిత్ర యూనిట్ ని శ్రీదేవి కోరారట.. అంతే తప్ప ఇలాంటి డిమాండ్లు పెట్టలేదు అని తెలిపారు. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ చెప్పారు, అప్పటికే చేసిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా కంటే తక్కువ ఇస్తామన్నారు. మా పిల్లలు చిన్న వారు వారితో సమయం గడిపేందుకు షెడ్యూల్ అడిగాం. ఒకవేళ అలా కుదరదు అంటే సినిమా చేయను అని శ్రీదేవి నేరుగా చెప్పారట. శ్రీదేవి బాహుబలి చేయకపోవడం పట్ల తనకు ఎటువంటి విచారం లేదని, ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కానీ శ్రీదేవి గురించి ఇలా మాట్లాడటం బాధ కలిగింది అని తెలిపారు బోనీ కపూర్. ఇంత మంది పెద్ద దర్శకుల దగ్గర, ఇంత పెద్ద పెద్ద బ్యానర్లలో ఆమె సినిమాలు చేశారు. ఒకవేళ శ్రీదేవి ఇలాంటి డిమాండ్లు పెడితే ఇన్ని సినిమాలు చేయడం సాధ్యం కాదు కదా అని ప్రశ్నించారు.